ePaper
More
    HomeజాతీయంAlert for smokers | పొగరాయుళ్లకు అలర్ట్.. అక్కడ బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్​ తాగితే రూ.1000...

    Alert for smokers | పొగరాయుళ్లకు అలర్ట్.. అక్కడ బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్​ తాగితే రూ.1000 జరిమానా!

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Alert for smokers : బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్​ తాగితే ఇకపై రూ.1000 జరిమానా కట్టాల్సిందే. ఈ మేరకు ఝార్ఖండ్​ ప్రభుత్వం(Jharkhand government) నిర్ణయం తీసుకుంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై రూపొందించిన ఝార్ఖండ్ సవరణ బిల్లు 2021(Jharkhand Amendment Bill 2021)కు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము(President Draupadi Murmu) ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాజ్ భవన్ సెక్రటేరియట్ ప్రకటించింది.

    Alert for smokers : నాలుగేళ్ల క్రితమే ఆమోదం

    ఈ సవరణ బిల్లును ఆమోదం తెలపడానికి ముందు ఝార్ఖండ్​లోని బహిరంగ ప్రదేశంలో సిగరెట్లు తాగితే రూ. 200 జరిమానా విధించే నిబంధన ఉండేది. ప్రస్తుతం ఇది ఐదు రెట్లు పెరిగి రూ. వెయ్యికి చేరుకుంది. ఈ సవరణను బిల్లును హేమంత్ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే అసెంబ్లీలో ఆమోదించింది.

    ఈ సవరణ బిల్లును అసెంబ్లీ(Assembly)లో ప్రవేశపెట్టే సమయంలో అప్పటి ఎజేఎస్​యూ ఎమ్మెల్యే లంబోదర్ మహతో (AJSU MLA Lambodar Mahato) కీలక ప్రతిపాదన చేశారు. బహిరంగ ప్రదేశంలో సిగరెట్​ తాగితే జరిమానా మొత్తాన్ని రూ.వెయ్యి నుంచి రూ.10,000కి పెంచాలని డిమాండ్ చేశారు.

    21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి సిగరెట్​, పొగాకు అమ్మడం నేరమని మహతో గుర్తుచేశారు. కాగా, ఝార్ఖండ్​ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించడానికి ఓ నెల ముందే రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష లేదా రూ. లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...