అక్షరటుడే, వెబ్‌డెస్క్: Muslim girl..get Rs. 5 lakh : ముస్లిం అమ్మాయిలను వివాహం చేసుకునే హిందూ యువకులకు రూ.5 లక్షలు ఇస్తానన్న కర్ణాటక(Karnataka) భాజపా ఎమ్మెల్యే బసం గౌడ పాటిల్ యత్నాల్ (BJP MLA Basam Gowda Patil Yatnal) వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఆదివారం (ఆగస్టు 17) ఎమ్మెల్యే బసం గౌడ పాటిల్ యత్నాల్ కాన్వాయ్‌ను పెద్ద ఎత్తున ముస్లింలు ముట్టడించారు. ఒక దశలో ఆయన కారును ధ్వంసం చేసేందుకు యత్నించారు.
కర్ణాటకలో ఇటీవల ఘోరం చోటుచేసుకుంది. ముస్లిం అమ్మాయిని ప్రేమించిన గవిసిద్ధప్ప అనే హిందూ యువకుడు మసీదు ఎదుటే దారుణ హత్యకు గురయ్యాడు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే బసం గౌడ పాటిల్ యత్నాల్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. ముస్లిం అమ్మాయిల(Muslim girls)ను వివాహం చేసుకునే హిందూ యువకులకు రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు.
Muslim girl..get Rs. 5 lakh : గతంలో యువమోర్చా..
2018లో భాజపా యువమోర్చా పేరు మీద కూడా ఇలాంటి ప్రకటనే వెలువడిందనే ప్రచారంలో ఉంది. ఎవరైనా హిందూ యువకుడు.. ముస్లిం యువతిని పెళ్లి చేసుకుంటే.. సదరు యువకుడికి రూ. 2.5 లక్షల నగదు ఇస్తామని భాజపా యువమోర్చా ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. ఈ మేరకు బీజేపీ యువమోర్చా నాయకులు సోషల్ మీడియాలో ప్రకటించినట్లు చెబుతున్నారు. రివార్డుతోపాటు రక్షణ బాధ్యత తాము చూసుకుంటామని పేర్కొన్నారు.