అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Satyakumar | ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు (YS Jagan Mohan Reddy) వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Health Minister Satyakuamr) సవాల్ విసిరారు. జగన్‌కు దమ్ముంటే తనను జైలుకు పంపాలన్నారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను (medical colleges) ప్రైవేట్ పరం చేస్తున్నారని ఇటీవల వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం వైఎస్ జగన్ మాట్లాడారు. కాలేజీలను ప్రైవేట్‌పరం చేయొద్దన్నారు. ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) ప్రైవేట్‌పరం చేస్తే.. ఆ కాలేజీలను తీసుకున్న ప్రైవేట్ వాళ్లందరూ జైల్లో వేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వాళ్లని జైల్లో పెడతామని హెచ్చరించారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.
Minister Satyakumar | జగన్‌వి పగటి కలలు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది తానేనని సత్యకుమార్ అన్నారు. తనపై ఎంక్వైరీ వేయాలన్నారు. తనను జైలుకు పంపాలని సవాల్ విసిరారు. ఇతరులను జైలుకు పంపడం కాదని, తను జైలుకు వెళ్లకుండా జగన్ కాపాడుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని జగన్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. తాటాకు చప్పుళ్లు తప్ప ఆయన ఏమీ చేయలేన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని వైసీపీ నేత చెప్పారని గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చాక ఏమి చేయలేదన్నారు. ఆయనకు మాట మీద నిలబడటం రాదని విమర్శించారు. కేవలం బెదిరించి పీపీపీ విధానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజలు, విద్యార్థులకు వైద్యం, వైద్య విద్య అందకుండా జగన్ చేస్తున్నారని మండిపడ్డారు.