అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో (Telangana Bhavan) శనివారం ఆయన మాట్లాడారు.
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను (BRS Sarpanch candidates) తెలంగాణ భవన్లో సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా దొరికారన్నారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించాలన్నారు. ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏడు ఎప ఎన్నికలు వస్తే.. అన్నింట్లో కాంగ్రెస్ ఓడిపోయిందని గుర్తు చేశారు.
KTR | విలీనంతో సమస్యలు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనంతో సమస్యలు తప్పవన్నారు. మొత్తం మూడు కార్పొరేషన్లను చేసేందుకు రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సిద్ధం అయ్యారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్కు 66శాతం సర్పంచ్ స్థానాలు వచ్చినట్లయితే వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు (MPTC and ZPTC elections) పెట్టాలన్నారు.
KTR | యూరియా కోసం తిప్పలు
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని విమర్శించారు. రైతులకు యూరియా సరఫరా చేయడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో యూరియా కష్టాలు లేవన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణాల్లో యూరియా ఇవ్వడం చేతకాని ప్రభుత్వం, యాప్లో అందిస్తుందా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉండదని విమర్శించారు.