Homeలైఫ్​స్టైల్​Junk Food | ఇవి తింటే.. గజినీలవుతారు!

Junk Food | ఇవి తింటే.. గజినీలవుతారు!

చాలా మంది రుచికరమైన పదార్థాలను తినడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని పదార్థాలు నోటికి రుచిగా ఉన్నా.. ఆరోగ్యానికి చేటు చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Junk Food | నాలుక రుచి కోరుతుంది. చాలా మంది ఏది రుచిగా ఉంటే దానినే తినడానికి ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్ని పదార్థాలను తినకపోవడమే ఉత్తమం.

కానీ అవి రుచికరంగా ఉండడంతో అలాంటి వాటినే తింటుంటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలతో అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని ఆహారాలతో గజినీలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాంటి ఆహార పదార్థాల గురించి తెలుసుకుందామా..

Junk Food | డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌..

సాధారణంగా నూనెలో బాగా వేయించిన ఫుడ్స్‌(Fried Foods) టేస్టీగా అనిపిస్తాయి. అందుకే సమోసా, పకోడి, చిప్స్‌(Chips) వంటివి ఇష్టంగా తింటుంటారు. అయితే ఇలా ఆయిల్‌లో బాగా వేయించిన ఆహార పదార్థాలలో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. బర్గర్‌లోనూ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఎక్కువగా సాల్టీగా ఉండే చిప్స్‌, బాగా వేయించినవన్నీ కూడా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి వాటిని తినకపోవడమే ఉత్తమం.

Junk Food | ప్రాసెస్డ్‌ స్వీట్స్‌, మీట్‌..

మార్కెట్‌లో లభించే కూల్‌ కేక్స్‌(Cool Cakes), స్వీట్స్‌, క్యాండీస్‌, చాక్లెట్స్‌ వంటివాటిని చాలామంది ఇష్టంగా తింటుంటారు. వీటిని తినడం వల్ల స్థూలకాలం వస్తుంది. దీనికి మతిమరుపు(Memory Loss) జబ్బు బోనస్‌.. అందుకే మెదడు పనితీరును తగ్గించే వీటి జోలికి పోకపోవడమే మంచిది. బన్‌, వైట్‌ బ్రెడ్‌, పాస్తా, పిజ్జా లాంటి బేకరీ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌(Junk Food) కూడా బ్రెయిన్‌పై ప్రభావం చూపుతాయి.
ప్రాసెస్డ్‌ మీట్‌(Processed Meat), ప్యాకేజ్డ్‌ మీట్‌లో హై సోడియం, ప్రిజర్వేటివ్స్‌ ఉంటాయి. జంక్‌ ఫుడ్‌లోనూ ఇవి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసి పనిచేయకుండా చేస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు.

Junk Food | మద్యపానం..

ఎక్కువగా మద్యపానం చేసేవారిలోనూ మెదడు పనితీరు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఆల్కహాల్‌తో కిడ్నీలపైనా ప్రభావం పడుతుంది. Cool Drinks కూడా మంచివి కావు. కాబట్టి ఆల్కహాల్‌తోపాటు కూల్‌డ్రింక్స్​కు కూడా దూరంగా ఉండాలి.