అక్షరటుడే, వెబ్‌డెస్క్ : New Year celebrations | హైదరాబాద్ నగరం (Hyderabad city) కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధం అవుతోంది. నగర వ్యాప్తంగా యువత, ప్రజలు డిసెంబర్ 31న పెద్ద ఎత్తున పార్టీలు చేసుకోనున్నారు.
న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు (Hyderabad police) అప్రమత్తం అయ్యారు. కొత్త సంవత్సరం వేడుకల వేళ మద్యం ఏరులై పారనుంది. రాత్రి ఒంటి గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చాలా మంది తాగి వాహనాలు నడిపే అవకాశం ఉంది. దీంతో నగర పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత మూడు రోజుల నుంచి నిత్యం రాత్రిపూట డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు (drunk driving checks) నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 31న రాత్రి పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతామని సీపీ సజ్జనార్ (CP Sajjanar) తెలిపారు. అదనపు బృందాలను సైతం ఏర్పాటు చేస్తామన్నారు.
New Year celebrations | జరిమానా కంటే తక్కువ
డ్రంకన్ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేల జరిమానా వేస్తామని పోలీసులు తెలిపారు. అలాగే జైలు శిక్ష కూడా వేస్తామన్నారు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మద్యం తాగితే స్టిరింగ్కు సలాం పెట్టి.. క్యాబ్‌ను బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. క్యాబ్ ఛార్జీలు జరిమానా కంటే తక్కువ ఉంటాయని తెలిపారు. వేడుకలు బాధ్యతతో జరుపుకోవాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
New Year celebrations | వారు తెలుసా అని అడగొద్దు
చాలా మంది డ్రంకన్ డ్రైవ్‌లో దొరకితే తమకు వారు తెలుసు వీరు తెలుసు అని పోలీసులకు చెబుతుంటారు. దీనిపై తాజాగా సీపీ పోస్ట్ చేశారు. మా డ్యాడీ ఎవరో తెలుసా, మా అంకుల్ ఎవరో తెలుసా అని పోలీసులకు అడగొద్దన్నారు. తాము ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తామని చెప్పారు. డ్రంకన్ డ్రైవ్‌లో దొరికితే వాహనం పక్కన పెట్టి డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందామని చెప్పారు.