అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | యువత మంచి మార్గంలో నడవాలని, నేరాలకు పాల్పడితే వారిపై షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పాత నేరస్తులు, అనుమానితుల గురించి శనివారం ఆరా తీశారు.
SP Rajesh Chandra | దేవునిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని..
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ (Devunipalli Police Station) పరిధిలోని రామేశ్వర్‌పల్లి, శాబ్దిపూర్ తండాలో గతంలో చోరీలకు పాల్పడిన సస్పెక్ట్ షీటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని పాపిలాన్ డివైస్ ద్వారా వారిని అక్కడే చెక్ చేశారు. గతంలో వారు చేసిన చోరీల వివరాలు, ప్రస్తుతం వారు ఏ పని చేస్తున్నారో, ఎలా జీవనం సాగిస్తున్నారని అనుమానితుల తల్లిదండ్రులతో మాట్లాడి ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లలపై షీట్లు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చిందో వివరించారు.
SP Rajesh Chandra | భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా..
భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఎస్పీ సూచించారు. ఇకపై సత్ప్రవర్తనతో, ఎలాంటి నేరాలు చేయకుండా ఉంటే షీట్ తొలగించే అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలు నివారించవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్లలో తెలియని ఏపీకే యాప్‌లు ఓపెన్ చేయకూడదని, సైబర్ నేరాల (Cyber Crimes) పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో గతంలో జరిగిన నేరాల గురించి వివరాలు తెలుసుకున్నారు.
SP Rajesh Chandra | జిల్లావ్యాప్తంగా 792 మందిపై..
అనంతరం డ్రైవర్స్ కాలనీ, బతుకమ్మ కుంట (Bathukamma Kunta) ప్రాంతంలో అనుమానితుల వద్దకు ఎస్పీ వెళ్లారు. జిల్లావ్యాప్తంగా గతంలో చోరీలకు పాల్పడిన 792 మందిపై షీట్లు ఓపెన్ చేయబడి ఉన్నాయని తెలిపారు. ఈ షీటర్లపై నిరంతర నిఘా కొనసాగిస్తూ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే శనివారం ఎస్సై, సీఐలు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు స్వయంగా ఫీల్డ్ లెవెల్ చెకింగ్ ద్వారా పాత నేరస్థులను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయని, ఆదివారం కూడా తనిఖీలు చేస్తామన్నారు. యువత బాగా చదువుకొని, క్రమశిక్షణతో జీవిస్తూ భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అలాగే పిల్లలు ఏం చేస్తున్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లితండ్రులపై ఉందన్నారు.