అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ravi Narayana Reddy Awards | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విమర్శలు చేశారు. జాతిపిత అని కొందరు వాళ్లంత వారే టైటిల్ ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి సోమవారం రావి నారాయణరెడ్డి జాతీయ అవార్డుల (Ravi Narayana Reddy National Awards) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను రాష్ట్రంలో లేకపోయిన ఇక్కడ జరుగుతున్న పరిణామాలను గమనించినట్లు చెప్పారు. ఉద్యమకారుడికి నోటీసులు ఇస్తారా అని అంటున్నారని, ఉద్యమ సమయంలో అన్ని సంఘాలను ఏకం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అలాంటి వ్యక్తి ఇంటిని బద్దలుకొట్టి అవమానించలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పదవులు తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అందరు చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
Ravi Narayana Reddy Awards | మీరు రాజులు కాదు
తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందేనని సీఎం అన్నారు. తాము ఎక్కడ ఉంటే అక్కడే విచారించాలనడం సరికాదన్నారు. మీరు రాజులు, చక్రవర్తులు కాదన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. వందల ఎకరాల ఫామ్‌హౌస్‌లు, వేల కోట్ల రూపాయాలు కేసీఆర్ కుటుంబానికి (KCR family) ఎలా వచ్చాయని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
గొప్ప నాయకుడు నారాయణరెడ్డి
స్వేచ్ఛను హరించి, హక్కులకు భంగం కలిగిస్తే తిరుగుబాటు వస్తుందని సీఎం అన్నారు. ప్రజల తిరుగుబాటు సాయుధ పోరాటంగా మారుతుందని రావి నారాయణరెడ్డి చాటిచెప్పారన్నారు. దేశంలో అధిక మెజారిటీతో గెలిచిన ఎంపీగా రావి నారాయణ రెడ్డి అని గుర్తు చేశారు. ఆయన అన్ని పదవులను త్యాగం చేసిన గొప్ప నాయకుడు అన్నారు.
ఈ రోజుల్లో అయితే ప్రజలు ఓడించినా పదవులు వదులుకునేందుకు కొందరు ఇష్ట పడటం లేదన్నారు.