అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భిక్కనూరు సౌత్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి (Vice Principal Rajeshwari) అన్నారు. రక్షా బంధన్‌ను పురస్కరించుకొని సౌత్ క్యాంపస్‌లో (South Campus) చెట్లకు రాఖీలు కట్టి రక్షాబంధన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్లు (Brothers and sisters) ఒకరికొకరు రక్షగా ఉంటామని, ప్రేమ ఆప్యాయతలతో జరుపుకునే రక్షా బంధన్ (Raksha Bandhan) మాదిరిగానే వృక్షాలను అదే ఆప్యాయతతో రక్షించాలని పిలుపునిచ్చారు. సౌత్ క్యాంపస్ జాతీయ సేవా సంస్థ (ఎన్ఎస్ఎస్) ఐదో, ఆరో యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. రోజురోజుకూ వాతావరణ కాలుష్యం పెరుగుతున్న పరిస్థితుల్లో వాతావరణ రక్షణ కోసం చెట్లను పెంచాలని బాధ్యతగా కాపాడాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు.
ఎన్ఎస్ఎస్ అధికారి డా అంజయ్య (NSS officer Dr. Anjaiah) మాట్లాడుతూ.. గతంలో చెట్లరక్షణ కోసం మహిళలే ముందుకు వచ్చి చిప్కో ఉద్యమానికి ఊతం ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అక్కాచెల్లెళ్లు ప్రేమతో అన్న తమ్ముళ్లకు కట్టే రాఖీలు చెట్లకు కట్టి వాటిని బాధ్యతగా కాపాడతామనే ఆలోచన పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రతి విద్యార్థి ఒక్కో మొక్కను దత్తత తీసుకొని కాపాడేలా రాఖీ కట్టించామని తెలిపారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్లు సునీత, యాలాద్రి, ఏపీఆర్వో సరిత, అధ్యాపకులు నర్సయ్య , లైబ్రేరియన్ రజిత, నాన్ టీచింగ్ సిబ్బంది బాలరాజు, సత్తయ్య, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.