అక్షరటుడే, వెబ్‌డెస్క్: Errabelli Dayakar Rao | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) విమర్శించారు. ఎరువులు, విత్తనాలు, కరెంట్‌తో పాటు అందుబాటులో ఉన్న నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. దేవాదుల నుంచి నీటిని విడుదల చేయడంలో రేవంత్ ప్రభుత్వం (Revanth Government) ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు.
నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయాలని.. లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. దేవాదుల నుంచి నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ఎర్రబెల్లి శుక్రవారం పాలకుర్తి మండలం మాదాపురం దంతాలతండా నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Errabelli Dayakar Rao | రైతును ఆగం జేసిన కాంగ్రెస్
రైతుల(Farmers) సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని ఎర్రబెల్లి విమర్శించారు. నీళ్లు ఇవ్వకుండా వేదిస్తోందన్నారు. తెలంగాణ(Telangana) వచ్చిందే నీళ్లు కోసం, అలాంటిది అదే నీళ్లు కోసం రైతులు అరిగోసలు పడుతున్నారని వాపోయారు.
కేసీఆర్ పాలన రైతుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపితే, ఈ కాంగ్రెస్ పాలన వారి కుటుంబాల్లో కడుపు మంట నింపుతోందని విమర్శించారు. నాడు రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ముందు చూపుతో రైతుబంధు, రైతు బీమా పెడితే దానిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govrnment) రాగానే మూలన పడేసిందని ఆరోపించారు. కనీసం రైతులకు, సాగునీరు, కరెంటు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. పంటలకు కనీసం ఎరువులు కూడా అందియ్యలేని స్థితిలో ఉందన్నారు. నాడు పాలకుర్తి నియోజకవర్గంలో రైతులు బాగుపడాలని రిజర్వాయర్ల కోసం 370 కోట్లు కేటాయించేలా కృషి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పనులు ముందుకు సాగడం లేదని వివరించారు. చెన్నూరు రిజర్వాయర్, పాలకుర్తి, ఉప్పగల్లు, ఘనపూర్, దేవరుప్పల రిజర్వాయర్లను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
Errabelli Dayakar Rao | బీఆర్ ఎస్ హయాంలోనే రైతుకు మేలు..
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని ఎర్రబెల్లి ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి కనీసం ఎప్పుడు సమీక్ష చేయాలో కూడా తెలియదని, రైతులందరూ నాట్లేసుకున్నాక సమీక్షలు పెడితే ఏం లాభం ? అని ప్రశ్నించారు. గతంలో మే నెలలో అధికారులతో సమీక్ష పెట్టి జూన్ 1 కల్లా నీటిని విడుదల చేసి రైతులకు మేలు చేసింది కేసీఆర్ ప్రభుత్వమని(KCR Government) తెలిపారు. గతంలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్ళు దూకేవని, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎండిపోయిన చెరువులు కనిపిస్తున్నాయన్నారు. మార్పు మార్పు అని మోసం చేసిన ఈ ప్రభుత్వ నిరక్ష్యం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో 519 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తును రాజు చేసి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది కేసీఆర్ అయితే, ఆ రైతు కుటుంబాల్లో కన్నీళ్లు మిగిల్చింది ఈ రేవంత్ ప్రభుత్వమని విమర్శించారు.
Errabelli Dayakar Rao | నిలిచిన కాలువల పనులు
ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులకు వెంటనే సాగునీరు ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. కొడకండ్ల మండలం లో లక్ష్మక్కపల్లి కాలువ పనులు ఆగి 2 ఏండ్లు అయినా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. పాలకుర్తి ,వావిలాల ,ముత్తరం ,గుండా పెద్దవంగర మండలానికి సాగు నీరు అందించేందుకు కాలువలు ప్రారంబిస్తే కొండాపురం వరకు వచ్చి ఆ పనులు కూడా ఆగి పోయాయన్నారు. రాయపర్తి మండలంలో కొండూరు,పోతిరెడ్డి పల్లి ,తిరుమలయపల్లి ,కేశవాపురం కాలువ పనులు ఎందుకు ఆగి పోయినాయని ప్రశ్నించారు. భూసేకరణ కూడా జరిగి రైతులకు డబ్బులు ముట్టిన పనులు ఎందుకు జరగటం లేదు అని కాంట్రాక్టర్ లను అడిగితే బిల్లులు రావటం లేదు అని అంటున్నారు. కావాలనే ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో రైతులను ఆగం చేస్తున్నదని ఆరోపించారు.
Errabelli Dayakar Rao | రైతును మోసం చేసిన కాంగ్రెస్..
కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అన్నదాతలను మోసం చేసిందని దయాకర్‌రావు ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి రైతు బంధు(Rythu Bandhu) ఎగ్గొట్టిందని, రుణమాఫీ అని మోసం చేసిందని విమర్శించారు. 40 % శాతం ఎక్కువ రుణమాఫీ కాలేదని తెలిపారు. అన్ని పంటలకు బోనస్ అని బోగస్ మాటలు మాటలు చెప్పి రైతులను మోసం చేశారన్నారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ అని అవి కూడా సరిగ్గా ఇవ్వటం లేదన్నారు.