Homeజిల్లాలుకామారెడ్డిHeavy Rain | రోడ్డు ప్రమాదం జరిగిందని వాహనాలను దారి మళ్లిస్తే.. వరుణుడి అడ్డగింత

Heavy Rain | రోడ్డు ప్రమాదం జరిగిందని వాహనాలను దారి మళ్లిస్తే.. వరుణుడి అడ్డగింత

- Advertisement -

అక్షరటుడే, గాంధారి : Heavy Rain : భారీ రోడ్డు ప్రమాదం (major road accident) జరగడంతో వాహనాలను దారి మళ్లించారు. మరోదారిలో గమ్యానికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు వెళ్తుండగా వరుణుడి అడ్డంకితో రాకపోకలకు ఇబ్బంది తప్పలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో గంటలకొద్దీ ఎక్కడివారు అక్కడే చిక్కుకు పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

Heavy Rain | రోడ్డు ప్రమాదం జరిగిందని వాహనాలను దారి మళ్లిస్తే.. వరుణుడి అడ్డగింత
Heavy Rain | రోడ్డు ప్రమాదం జరిగిందని వాహనాలను దారి మళ్లిస్తే.. వరుణుడి అడ్డగింత

కామారెడ్డి జిల్లా (Kamareddy district) గాంధారి మండలం (Gandhari mandal) గుర్జాల్​ సమీపంలోని బ్రిడ్జి వద్ద శనివారం (జులై 19) సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. లింగంపేట్ మండలం ఎల్లమ్మ తండా వద్ద ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు RTC bus, ఇసుక లారీ ఢీ కొన్నాయి. ఫలితంగా నిజాంసాగర్ Nizamsagar రోడ్డు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Heavy Rain : భారీ వర్షంతో ఉద్ధృతంగా మారిన వాగు..

Heavy Rain | రోడ్డు ప్రమాదం జరిగిందని వాహనాలను దారి మళ్లిస్తే.. వరుణుడి అడ్డగింత
Heavy Rain | రోడ్డు ప్రమాదం జరిగిందని వాహనాలను దారి మళ్లిస్తే.. వరుణుడి అడ్డగింత

దీంతో వాహనాలను నల్లమడుగు, గుర్జాల్, మోతె మీదుగా ఎర్ర పహాడ్​కు మళ్లించే ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ దారి మీదుగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు private vehicles , cars వెళ్తుండగా.. అదే సమయంలో భారీగా వర్షం కురవడంతో గుర్జాల్ శివారులోని వాగు పొంగి ఉద్ధృతంగా మారింది.

దీంతో ఆ దారిలో మళ్లింపు చేపట్టిన వాహనాలు వాగు వద్దకు చేరుకుని నిలిచిపోయాయి. పదుల సంఖ్యలో వాహనాలు రావడంతో భారీగా ట్రాఫక్​ జామ్​ traffic jam అయింది. ఫలితంగా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

చివరికి వర్షం తగ్గుముఖం పట్టిన రెండు గంటల తర్వాత వాగులోని stream నీటి ప్రవాహం ఉద్ధృతి తగ్గడంతో వాహనాలు ముందుకు కదిలాయి. గంటల ఆలస్యం తర్వాత తమ గమ్యం బాట పట్టాయి వాహనాలు. దీంతో రెండు గంటల తర్వాత వాహనదారులు ఉపశమనం పొందారు.