ePaper
More
    HomeతెలంగాణHarish Rao | మూడు పిల్ల‌ర్లు కుంగిపోతే ఇంత రాద్దాంతమా? క‌విత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో హ‌రీశ్‌రావు...

    Harish Rao | మూడు పిల్ల‌ర్లు కుంగిపోతే ఇంత రాద్దాంతమా? క‌విత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో హ‌రీశ్‌రావు సూటి ప్ర‌శ్న‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Harish Rao | కాళేశ్వ‌రం ప్రాజెక్టులో మూడు పిల్ల‌ర్లు కుంగిపోతేనే కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీవ్ర రాద్ధాంతం చేస్తోంద‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) విమ‌ర్శించారు. బీఆర్​ఎస్ పార్టీకి కేసీఆరే సుప్రీం అని, ఎవ‌రి విష‌యంలోనైనా నిర్ణ‌యం తీసుకునేది ఆయ‌నేన‌ని చెప్పారు.

    కూతురి ఉన్నత విద్యకోసం యూకేకు వెళ్లిన ఆయ‌న లండ‌న్‌లో బీఆర్ఎస్ జ‌రిగిన కార్య‌కర్త‌ల స‌మావేశంలో హ‌రీశ్‌రావు మాట్లాడారు. ఎమ్మెల్సీ క‌విత‌ (MLC Kavitha) ఇటీవ‌ల త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న సూటిగా స్పందించ‌లేదు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి, కేసీఆర్ నాయ‌క‌త్వం గురించి మాట్లాడుతూ ప‌రోక్షంగా క‌విత వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయడమే తనకు కేసీఆర్‌ నేర్పించారని తెలిపారు. పార్టీలో కేసీఆరే సుప్రీం అని, ఏ నిర్ణ‌య‌మైనా ఆయ‌నే తీసుకుంటార‌ని చెప్పారు. కేసీఆర్ (KCR) నాయకత్వంలో చివరిశ్వాస వరకు పని చేస్తానని స్పష్టికరించారు. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని హరీష్‌ రావు తేల్చిచెప్పారు.పార్టీ పుట్టుక నుంచి కేసీఆర్‌ అడుగుజాడల్లో పని చేశానని, భవిష్యుత్తులో కూడా పని చేస్తానని హరీష్‌ రావు స్పష్టం చేశారు.

    Harish Rao | ఎందుకింత రాద్ధాంతం

    కాళేశ్వ‌రంలో జ‌రిగిన అవినీతి వెన‌క మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఉన్నార‌న్న ఎమ్మెల్సీ క‌విత తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో.. ల‌క్ష‌లాది ఎక‌రాలను సాగులోకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని నిర్మించార‌ని చెప్పారు. అతిపెద్ద కాళేశ్వ‌రం ప్రాజెక్టులో (Kaleshwaram Project) ఒకటైన మేడిగ‌డ్డ బ‌రాజ్ వ‌ద్ద మూడు పిల్లర్లు కుంగితే రేవంత్‌రెడ్డి సర్కార్ రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎక్క‌డ కేసీఆర్‌కు పేరు వ‌స్తుందోన‌ని మేడిగ‌డ్డ బరాజ్‌కు మ‌ర‌మ్మ‌తులు చేయ‌డం లేద‌ని ఆరోపించారు. పిల్ల‌ర్లు కుంగిపోయాయంటున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress Government) ఏడాదిన్నర నుంచి ఏం చేస్తోందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్‌ డిమాండ్‌ ఉండదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని తెలిపారు.

    Harish Rao | భ‌యాందోళ‌న‌లో రియ‌ల్ ఎస్టేట్

    కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా ప‌డిపోయింద‌ని హ‌రీశ్‌రావు ఆరోపించారు. హైడ్రా (Hydraa) పేరుతో రాష్ట్రంలో భ‌యాందోళ‌న‌లు సృష్టించార‌న్నారు. దీంతో హైడ్రా కార‌ణంగా హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలిందని విమర్శించారు. రేవంత్ స‌ర్కారు (Revanth Government) వ‌ల్లే రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని, వ‌చ్చిన కంపెనీలు కూడా వెళ్లిపోతున్నాయ‌ని ఆరోపించారు. ఎన్నారైలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు.

    More like this

    Donald Trump | భారత్, రష్యా దూరమైనట్లే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Donald Trump | సుంకాల విధింపుతో భారత్ తో సంబంధాలు ఉద్రిక్తంగా మారిన వేళ...

    Rajampet mandal | తృటిలో తప్పిన పెను ప్రమాదం.. గ్యాస్​ ట్యాంకర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

    అక్షరటుడే, కామారెడ్డి: Rajampet mandal | గ్యాస్ ట్యాంకర్​ను ఆర్టీసీ బస్సు వెనుకనుండి ఢీకొట్టింది. ఈ ఘటన రాజంపేట...

    Sushanth-Meenakshi | మ‌రోసారి అడ్డంగా దొరికిన సుశాంత్-మీనాక్షి.. రిలేష‌న్ గురించి అనేక ఊహాగానాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Sushanth-Meenakshi | యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్,...