అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Aadhaar Card Update | ప్రస్తుతం ప్రతి చోటా ఆధార్( Aadhaar Card) తప్పనిసరి. ఏ ప్రభుత్వ పథకానికి(Govt Scheme) అర్హత పొందాలన్నా.. ఆధార్ కార్డు ఉండాల్సిందే.
ఇతర గుర్తింపు కార్డులు ఎన్ని ఉన్నా.. ఇప్పుడు ఆధార్‌తోనే అన్ని పనులు అవుతాయి. అయితే ఆధార్ కార్డు నమోదు (Aadhaar card registration) చేసుకునే సమయంలో చాలా మంది వివరాలు తప్పులుగా నమోదు అయ్యాయి. కొంతమంది పేర్లలో అక్షర దోషాలు, పుట్టిన తేది తప్పుగా నమోదు కావడం లాంటివి జరిగాయి. అయితే వీటిని మార్చుకోవడానికి ప్రస్తుతం ఉచితంగా అవకాశం కల్పిస్తున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ఉచితంగా మార్పులు చేసుకునే అవకాశాన్ని తీసివేస్తామని ఆధార్ రెగ్యులేటరీ సంస్థ (UIDAI) తెలిపింది.
Aadhaar Card Update | మార్చుకోవడం ఎందుకంటే..
చాలా మంది ఆధార్‌కార్డులో తప్పులు ఉన్నా.. అలాగే ఉంచుతారు. అయితే ఏదైనా ఉద్యోగం(Job), ప్రభుత్వ పథకం కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆ తప్పులే మన కొంప ముంచుతాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) రుణమాఫీ(Loan Waiver) చేసిన సమయంలో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లో పేర్లు ఒకేలా లేకుంటే మాఫీ వర్తించలేదు. దీంతో ప్రభుత్వం వారు పేర్లు చేసుకున్నాక మరోసారి రుణమాఫీ వర్తింప చేసింది. ఇలా ఆధార్‌కార్డులో మిస్టేక్‌లు ఉంటే అసలు సమయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకు ముందుగానే మార్పులు చేసుకోవడం మంచిది.
Aadhaar Card Update | అప్పటి వరకే ఉచితం
ఉచితంగా ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవడానికి జూన్ 14 వరకు మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏదైనా కరెక్షన్ చేయించుకోవాలంటే ఫీజు కట్టాల్సిందే. 2016 ఆధార్ ఎన్రోల్ మెంట్ (Aadhaar Enrollment), రెగ్యులేషన్- లో భాగంగా జూన్ 14 తర్వాత ఆ గడువు ముగుస్తుందని ప్రకటించింది.
ఆ తర్వాత ప్రతి అప్డేట్కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. గడువులోపు కొన్ని వివరాలను ఆన్లైన్లో myAadhaar portal ద్వారా ఉచితంగా ఎవరికి వారు అప్డేట్ చేసుకోవచ్చు. కొన్నింటికి మాత్రం తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డులో (Aadhar card) ఏమైనా తప్పులు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే కరెక్షన్ చేయించుకోండి.