అక్షరటుడే, కామారెడ్డి: CPM Kamareddy | పోలీసులే ప్రాణాలు తీస్తే కోర్టులు ఎందుకని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో (R&B Guest House) ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లను సీపీఎం జిల్లా కమిటీ (CPM party district committee) తరపున ఖండిస్తున్నామన్నారు.
బీజేపీ ప్రభుత్వం (BJP government) ఆదివాసీల కాళ్లకింద ఉన్న ఖనిజ సంపద, అడవులను అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ దేశాలకు తరలించేందుకు కుట్ర పన్నుతోందన్నారు. నక్సలైట్ల పేరుతో అమాయకులైన ఆదివాసీలను చంపుతూ మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు.
దొరికిన వారిని కోర్టులో హాజరుపర్చకుండా చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీస్తే కోర్టులు ఎందుకని ప్రశ్నించారు. ఈ రాజ్య హింసను మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు ఖండించాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతీరాం నాయక్, కొత్త నర్సింలు, నాయకులు మోహన్, దశరథ్ పాల్గొన్నారు.
