అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court | హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలిలో (kanche gachibowli) పర్యావరణాన్ని పునరుద్ధరించాలని, లేకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు(supreme court) మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
“పర్యావరణ వినాశనంలో అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు.. ఇందులో చీఫ్ సెక్రెటరీ, ఇతర అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు. వరుస (శుక్ర, శని, ఆదివారాలు) సెలవులను ఆసరాగా చేసుకొని అంత పెద్ద మొత్తంలో చెట్లు నరికేస్తారా..? డజన్ల కొద్ది బుల్డోజర్లను తీసుకొచ్చి విధ్వంసం సృష్టిస్తారా?” అని సీజేఐ బీఆర్ గవాయ్ (CJI BR Gavai) తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు.
కంచ గచ్చిబౌలిలో చెట్లు నరికిన 100 ఎకరాల్లో తిరిగి పచ్చదనం పెంచకపోతే సీఎస్(CS)ను జైలుకు పంపిస్తామని సీజేఐ బీఆర్ గవాయ్(CJI BR Gavai) హెచ్చరించారు. సీఎస్తో సహా ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులనందరినీ ఆ ప్రాంతంలోని కొలనులో తాత్కాలిక జైలు కట్టి, అందులోనే పెడతామని వ్యాఖ్యానించారు.
కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో సుమోటో కేసుతో పాటు ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్'(Be the Change Welfare) సొసైటీ, ఇతర ఇంప్లీడ్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. చెట్లు నరికేందుకు ఎన్విరాన్మెంటల్ సర్టిఫికెట్(ఈసీ) తీసుకున్నారా.. ? అని దేశ అత్యున్నత ధర్మాసనం నిలదీసింది.
Suprem Court | స్కూళ్లను బుల్డోజ్ చేశారు
విజిల్ బ్లోయర్స్(Whistle Blowers), స్టూడెంట్స్పై కేసులు నమోదు చేసినట్లు పలువురు అడ్వకేట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించి ఇంప్లీడ్ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేసినట్లు చెప్పారు. సదరు ప్రాంతంలో మూడు రన్నింగ్స్ పాఠశాలలను కూల్చివేశారని ఆరోపించారు.
కాగా, స్కూల్స్ కూల్చివేశారన్న వాదనపై సీజేఐ బీఆర్ గవాయ్(CJI BR Gavai) ఆశ్చర్యపోయారు. అయితే ఈ ఐఏను సదరు కేసుతో కలిపి విచారించడం కుదరదని సీజేఐ అన్నారు. కావాలంటే వేరే పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ.. ఐఏను విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు.