అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court on meta | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ (social media platform) వాట్సాప్, దాని మాతృ సంస్థపై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత చట్టాలను గౌరవించకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది.
వాట్సాప్ ప్రైవసీ పాలసీపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ సూర్య నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజల గోప్యతతో ఆటలాడలేరు.. మా డేటాలో ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మేము మిమ్మల్ని అనుమతించము” అని పేర్కొంది.
Supreme Court on meta | దోపిడీ కిందకు వస్తుంది
వాట్సాప్ (WhatsApp) 2021 గోప్యతా విధానానికి సంబంధించిన పిటిషన్ను కోర్టు విచారిస్తోంది. వాట్సాప్ వినియోగదారుల డేటాను మెటా సంస్థతో పంచుకుంటున్నట్లు ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై గతంలో కంపెనీ లా ట్రిబ్యునల్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూ. 213 కోట్ల జరిమానాను విధించింది. సుప్రీంకోర్టు తాజాగా ఆ జరిమానాను సమర్థించింది. ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. వినియోగదారు డేటాను పంచుకోవడం కోసం “దోపిడీ” కిందకు వస్తుందన్నారు. ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. రాజ్యాంగాన్ని పాటించలేకపోతే, భారతదేశం విడిచి వెళ్లండి. పౌరుల గోప్యతను రాజీ పడటానికి తాము అనుమతించమని స్పష్టం చేసింది.
Supreme Court on meta | సామాన్యులు ఎలా అర్థం చేసుకుంటారు
దేశంలోని లక్షలాది మంది పేదలు, చదువురాని ప్రజలు వాట్సాప్ ప్రైవసీని ఎలా అర్థం చేసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. కొన్ని సార్లు వాట్సాప్ విధానాలు తమకు అర్థం కావడం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. వాట్సాప్లో ఒక వైద్యుడు తనకు వాట్సాప్లో మందుల ప్రిస్క్రిప్షన్లను పంపాడని చెప్పారు. అనంతరం తనకు ఆ మందులకు సంబంధించిన యాడ్లు కనిపించినట్లు తెలిపారు. పౌరుల గోప్యతకు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.