అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Food Delivery Apps | ఫుడ్ డెలివరీ(Food delivery) ఫ్లాట్‌ఫాంలు తమ కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. రెయిన్ సర్‌ఛార్జి(Rain surcharge) మినహాయింపును తొలగించాలని నిర్ణయించాయి. ఇకపై వర్షం పడితే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్న మాట.
స్విగ్గీ, జొమాటో(Zomato)లు వినియోగదారులను ఆకర్షించేందుకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను అమలు చేస్తున్నాయి. జొమాటో ‘గోల్డ్’ పేరిట, స్విగ్గీ ‘వన్’ పేరిట సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఆయా ప్లాన్లతో ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. అందులో రెయిన్ సర్‌చార్జి మినహాయింపు ఒకటి. వర్షం కురిసినప్పుడు సాధారణ కస్టమర్లనుంచి అదనంగా రెయిన్ సర్‌చార్జి(Rain surcharge) వసూలు చేస్తారు. సాధారణంగా రూ. 10 నుంచి రూ. 35 వరకు వసూలు చేసేవారు. అయితే సబ్‌స్క్రైబర్లకు దీనినుంచి మినహాయింపు ఉండేది. దానిని తొలగిస్తున్నట్లు జొమాటో తాజాగా ప్రకటించింది. ఇకపై సాధారణ వినియోగదారుల్లాగే గోల్డ్(Gold) సబ్‌స్క్రైబర్లు కూడా వర్షం కురిస్తే అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుందన్న మాట. ఇది శుక్రవారం(Friday) నుంచి అమలులోకి వచ్చింది. స్విగ్గీ (Swiggy)కూడా ఇదే బాటలో పయనిస్తోంది. నష్టాలను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
