అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhatti Vikramarka | విద్యుత్ ఉత్పత్తి పెంచుకోకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. విద్యుత్ రంగంపై ఆయన శనివారం ప్రజెంటేషన్ ఇచ్చారు.విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
2047 వరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్లకు చేరాలన్నదే తమ లక్ష్యం.. ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందితేనే ఎకానమీ ఆశించిన స్థాయిలో పెరుగుతుందని వెల్లడించారు. తెలంగాణ (Telangana)ను ప్రపంచ స్థాయి నగరాలతో అభివృద్ధి చేస్తామన్నారు. పదేళ్లుగా రాష్ట్రంలో పవర్ డిమాండ్ భారీగా పెరుగుతోందని వెల్లడించారు. 2026 ఏప్రిల్ నాటికి అందుబాటులో 24,769 మెగావాట్లు, 2047 నాటికి లా 39 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అని పేర్కొన్నారు.
Bhatti Vikramarka | గ్రీన్ ఎనర్జీ వాడాలి
మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, పెట్టుబడుల ఒప్పందం, డేటా సెంటర్లతో హైదరాబాద్ గ్లోబల్ హబ్ (Hyderabad Global Hub)గా మారబోతుందని చెప్పారు. దానికి కావాల్సిన విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించామన్నారు. వాడే విద్యుత్‌లో 50 శాతం గ్రీన్ ఎనర్జీ (Green Energy) ఉండాలన్నారు. ఎనర్జీ స్టోరేజీ గతంలో లేదన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో విద్యుత్‌ను స్టోర్ చేసుకోవచ్చని చెప్పారు. సోలార్, థర్మల్, విండ్ పవర్ స్టోరేజీలో మనం వెనకబడి ఉన్నామని తెలిపారు. 2027-28 వరకు థర్మల్ పవర్లో ఇబ్బంది లేదని, 2029-30 వరకు వెయ్యి మెగావాట్ల మైనస్‌లోకి వెళ్తామని ఆయన వెల్లడించారు.