ePaper
More
    HomeతెలంగాణKaushik Reddy | నా మీద కేసులు పెడితే AK-47 గన్ అవుతా: కౌశిక్​ రెడ్డి

    Kaushik Reddy | నా మీద కేసులు పెడితే AK-47 గన్ అవుతా: కౌశిక్​ రెడ్డి

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Kaushik Reddy : తన మీద కేసులు పెడితే AK-47 గన్ అవుతానని బీఆర్​ఎస్​ నేత (BRS leader), ఎమ్మెల్యే కౌశిక్ ​రెడ్డి (MLA Kaushik Reddy) పేర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎక్స్‌టార్షన్‌​ అని తన మీద కేసు పెట్టారని.. ఎక్స్‌టార్షన్‌​ అంటే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాంట్రాక్టర్ల దగ్గర 20 శాతం కమీషన్ తీసుకునేదని కౌశిక్​రెడ్డి ఆరోపించారు.

    వరంగల్ జిల్లా(Warangal district)లో సీతక్క ఇసుక దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేయడం ఎక్స్‌టార్షన్‌​(Extortion – దోపిడీ) అని పేర్కొన్నారు. కడియం శ్రీహరి(Kadiyam Srihari) పేదలను బెదిరించి భూములు గుంజుకోవడం ఎక్స్‌టార్షన్‌​(Extortion) అని అన్నారు.

    వరంగల్ జిల్లాలో జరుగుతున్న స్కాములన్నీ ప్రెస్ మీట్ పెట్టి బయట పెడతానని స్పష్టం చేశారు. ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలతో సహా మొత్తం బయటపెడతానని అన్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రెస్​మీట్​ (press meet) ఉంటుందన్నారు. తనకు బెయిల్ వచ్చేలా చేసిన బీఆర్ఎస్ లీగల్ టీంకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) కృతజ్ఞతలు తెలిపారు.

    More like this

    Stock Markets | లాభాల బాటలో మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్‌(IT...

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...