అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఎమ్మెల్సీ మధుసూదనాచారి(MLC Madhusudhanachari) హెచ్చరించారు.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై ఎటు తేలడం లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బుధవారం మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఓ వైపు సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) చెబుతున్నారన్నారు. మరోవైపు ఆయనే కోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు.‘‘అన్యాయం జరిగితే భరించొచ్చు.. అవమానం జరిగితే సహించం.. మనసు గాయపడితే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయి’ అని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చినట్లు 42శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్నారు. లేకపోతే ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఇది కాంగ్రెస్ పార్టీ(Congress Party) తానంతట తాను ఇచ్చిన హామీ అని.. బీసీలు చేసిన డిమాండ్ కాదన్నారు. బీసీలకు 75 ఏళ్లుగా దేశంలో అన్యాయం జరిగిందన్నారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఆ హామీని అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.