అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులపై (government officials) ఏసీబీ కొరడా ఝులిపిస్తోంది. వరుసగా దాడులు చేస్తూ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ప్రజలకు ఏసీబీని మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది.
ఎవరైనా అధికారులు లంచం (bribe) అడిగితే తేలికగా సమాచారం ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా టోల్ ఫ్రీ నంబర్లను ప్రజలకు అందిస్తోంది. ఇందుకోసం నిజామాబాద్, కామారెడ్డి పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో 1064 టోల్ ఫ్రీ నంబర్ స్టిక్కర్లను అతికించారు. ఏదైనా పని నిమిత్తం కార్యాలయాలకు వెళ్లినప్పుడు అధికారులు లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.