Indur BJP

Indur BJP | ఆడపిల్ల పుడితే.. కానుకలు ఇస్తారట.. ఇందూరులో వినూత్న కార్యక్రమం..

అక్షరటుడే, ఇందూరు: Indur BJP | ఆడపిల్ల పుడితే ప్రోత్సాహకాలు ఇస్తామని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు నగరంలో (Nizamabad City) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు తాము ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సదరు బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు.

Indur BJP |  నిజామాబాద్​ నగరంలో..

అమ్మ కానుక (Amma kanuka) అందజేస్తానంటూ నగరంలోని 36వ డివిజన్ బీజేపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రకటించారు. తల్లి చింత నరసమ్మ జ్ఞాపకార్థం 3వ డివిజన్లో పుట్టిన ప్రతి ఆడపిల్లకు రూ.5,116 అందజేస్తానని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

గతనెల 20న బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాదాల నరేష్ (yadala naresh) కూడా తన డివిజన్ పరిధిలో (5వ డివిజన్) ఆడపిల్ల పుడితే ఆ కుటుంబసభ్యులకు రూ.5016 అందజేస్తానని ప్రకటించారు. దీంతో డివిజన్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలు పార్టీలకతీతంగా నిర్వహిస్తామని వారు పేర్కొనడం కొసమెరుపు.