అక్షరటుడే, కామారెడ్డి : Tadwai Mandal | ఆడపిల్ల పుడితే భారం అనుకుని కడుపులోనే గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. అలాంటి ఈ రోజుల్లో ఆడపిల్ల పుడితే రూ.5వేలు ఇస్తానని పంచాయతీ ఎన్నికల్లో ఓ సర్పంచ్ అభ్యర్థి మాటిచ్చాడు.
Tadwai Mandal | ఇచ్చిన మాట కోసం..
పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) సర్పంచ్‌గా గెలిస్తే ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఇస్తానని తాడ్వాయి మండలంలోని కాళోజీవాడి గ్రామం (Kalojiwadi Village)లో బద్దం చంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఈమేరకు ఎన్నికల్లో చంద్రారెడ్డి విజయం సాధించాడు. ఆడపిల్లను పుట్టనిద్దాం.. బతకనిద్దాం.. చదవనిద్దాం అనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ.5 వేలను సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) అనే పథకంలో వేస్తానని తెలిపారు.
Tadwai Mandal | నిరుపేదల ఇంట్లో ఎవరైన మృతి చెందితే..
గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వారు మృతి చెందితే వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆర్థిక సహాయం అందజేస్తానని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న యువకుల కోసం ప్రత్యేక లైబ్రరీ (Special Library)ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. తన సొంతగా రూ.లక్ష డిపాజిట్ చేయడంతో పాటు ప్రతినెలా వచ్చే సర్పంచ్ గౌరవ వేతనం కూడా గ్రామ ప్రజలకు ఖర్చు చేస్తామని తెలిపారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా తన సొంత డబ్బులతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. త్వరలోనే ఈ హామీలన్నీ కార్యరూపం దాలుస్తాయని, మండలంలోనే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానని పేర్కొన్నారు.