అక్షరటుడే, ఇందూరు: Basara | శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలో ఆదివారం లలితా చంద్రమౌళీశ్వర ఆలయంలో (Lalita Chandramoulishwara temple) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి (Jagadguru Vidhusekhara Bharathi Mahaswami) సమక్షంలో ఆలయంలో హోమం, శిఖర మహాకుంభాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. బాసర క్షేత్రంలో లలితా చంద్రమౌళీశ్వర ఆలయం నిర్మించి పూజాకార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLAs Dhanpal Suryanarayana Gupta), రామారావు పటేల్, శృంగేరి మఠం బాసర ట్రస్ట్ సభ్యులు, వేద పండితులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.