అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామానికి (Maggidi Village) చెందిన ఆదర్శ రైతు నలిమెల చిన్నారెడ్డి ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
రైతులు తమ పొలాలు కోతలయ్యాక కొయ్యలను నిప్పుపెట్టడంతో పర్యావరణానికి హాని కలిగిస్తుండగా రైతు చిన్నారెడ్డి మాత్రం వినూత్న పద్ధతిలో ముందుకెళ్తున్నారు. చాలా ప్రాంతాల్లో పొలం కోసిన తర్వాత రైతులు (Farmers) కొయ్యలను తగలబెట్టేస్తున్నారు. దీంతో పర్యావరణానికి హాని జరుగుతోంది. అలాగే పొలాలకు దగ్గరగా ఉన్న రోడ్లపై వెళ్తున్న వారికి పొగ కారణంగా ఇబ్బందులు ఏర్పడుతోంది.
Armoor | భూమికి సైతం సారం..
కొయ్యలను తగలబెట్టకుండా ఉండేందుకు ఆదర్శ రైతు నలిమెల చిన్నారెడ్డి వినూత్నంగా ఆలోచించాడు. తన వ్యవసాయ క్షేత్రంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాడు. పంట వ్యర్థాలను తగలపెట్టకుండా పొలంకోసిన తర్వాత కొద్దిగా నీరుపెట్టి 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్పేట్ చల్లాడు. అనంతరం ట్రాక్టర్ కేజీవీల్స్లో దమ్ముచేస్తే ఆ పంట వ్యర్థాలు భూమిలో కలిసిపోయాయి. ఒక నెలరోజులు ఆరబెట్టిన తర్వాత తిరిగి కల్టివేటర్ చిన్ననాగళ్లతో దున్నుకొని రెండో పంటకు రెడీ చేసుకోవచ్చు. దీంతో భూమిలో సారం సైతం పెరుగుతుందని పంట వేయడం ఆలస్యమైనా ఎలాంటి ఇబ్బంది లేదని.. మరోపంట వేసేంతవరకు అది కుళ్లిపోయి పంటల ఎదుగుదల, దిగుబడికి దోహదపడుతుందని రైతు చిన్నారెడ్డి తెలిపారు.
Armoor | ప్రయోజనాలివే..
1) భూమికి పరిపూర్ణమైన సారం అందుతుంది.
2) వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించవచ్చు.
3) కొయ్యలను తగలబెట్టినప్పుడు వేడికి భూమిలో ఉన్న సారం పోతుంది. దానికి ఈ ప్రయత్నం ద్వారా తగ్గించవచ్చు.
