అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ICICI Prudential AMC IPO | ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ 1998 లో ఏర్పాటయ్యింది. ఇందులో ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మరియు యూకే ఆధారిత ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ 51:49 నిష్పత్తితో వాటా కలిగి ఉన్నాయి. ఈ కంపెనీ భారతీయ ఆస్తి నిర్వహణ రంగంలో ఒక ప్రముఖ సంస్థ. త్రైమాసిక సగటు ఆస్తుల నిర్వహణ పరంగా రెండో అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. మార్కెట్ వాటా 13.2 శాతంగా ఉంది. ఇది భారతదేశంలో అత్యధిక మ్యూచువల్ ఫండ్ పథకాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 10,602.65 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో (IPO)కు వస్తోంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్.
ప్రైస్ బ్యాండ్..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 2,061 నుంచి రూ. 2,165 గా నిర్ణయించింది. ఒక లాట్లో 6 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు (Retail Investors) ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్‌బ్యాండ్ వద్ద కనీసం రూ. 12,990 తో బిడ్ వేయాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 15 లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
ఐపీవో సబ్స్క్రిప్షన్ డిసెంబర్ 12 న మొదలవుతుంది. బిడ్డింగ్‌కు డిసెంబర్ 16 వరకు అవకాశం ఉంది. 17వ తేదీ రాత్రి అలాట్మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 19 న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.
కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 50 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు. ఐసీఐసీఐ బ్యాంక్ వాటాదారుల కోసం 24.48 లక్షల ఈక్విటీ షేర్ల వరకు రిజర్వేషన్ చేసింది. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 130 ఉంది. లిస్టింగ్ సమయంలో 6 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
కంపెనీ ఆర్థిక పరిస్థితి..
2023 -24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 3,761.21 కోట్ల రెవెన్యూ ద్వారా రూ. 2,049.73 కోట్ల ప్యాట్ జనరేట్ చేసింది. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రూ. 4,979.67 కోట్లకు, ప్యాట్ రూ. 2,650.66 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఆస్తులు(Assets) రూ. 3,554.09 కోట్లనుంచి రూ. 4,383.68 కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ 2025 తో ముగిసిన ఆరు నెలల కాలానికి ఆదాయం 20 శాతం పెరుగుదలతో రూ.2,949.4 కోట్లకు, లాభం 21.9 శాతం పెరుగుదలతో రూ.1,618 కోట్లకు చేరాయి.