అక్షరటుడే, వెబ్డెస్క్: ICICI Prudential AMC IPO listing | మార్కెట్నుంచి రూ.10,602.65 కోట్లు సమీకరించేందుకు ఐసీఐసీఐ బ్యాంకు అనుబంధ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ((ICICI Prudential AMC)) ఐపీవోకు వచ్చింది. డిసెంబర్ 12నుంచి 16 వరకు సబ్స్క్రిప్షన్ స్వీకరించారు.
పెద్ద ఐపీవో(IPO) అయినా ఈ కంపెనీ షేర్లకు ఇన్వెస్టర్లనుంచి డిమాండ్ లభించింది. దీంతో మొత్తం కోటా 39.17 రెట్లు, రిటైల్ కోటా(Retail quota) 2.53 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో 123.87 రెట్ల బిడ్లు వచ్చాయి. కంపెనీ షేర్లు శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను గరిష్ట ప్రైస్బ్యాండ్ వద్ద రూ.2,165 వద్ద విక్రయించగా.. ఎన్ఎస్ఈలో రూ. 435 ప్రీమియం (Premium)తో రూ. 2,600 వద్ద లిస్టయ్యాయి.
బీఎస్ఈలో రూ. 441 లాభంతో రూ. 2,606 వద్ద నమోదయ్యాయి. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 20 శాతానికిపైగా లాభాలు వచ్చాయన్నమాట. కంపెనీ షేర్ ధర ఇంట్రాడేలో రూ. 2,663 వరకు పెరిగి గరిష్టాన్ని నమోదు చేశాక ప్రాఫిట్ బుకింగ్తో రూ. 2,575కు పడిపోయింది. చివరికి రూ. 2,585 వద్ద స్థిరపడింది.