అక్షరటుడే, వెబ్‌డెస్క్: ICC Women World Cup మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (Women’s ODI World Cup 2025)లో టీమిండియా Team India సెమీఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.
ఈ హై వోల్టేజ్ పోరు అక్టోబర్ 30న రెండో సెమీఫైనల్‌గా జరగనుంది. ఇక అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి.
భారత్ India వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025 తుది దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లు ఆదివారంతో ముగిశాయి. బంగ్లాదేశ్, భారత్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షార్పణం అయింది.
27 ఓవర్లకి కుదించి మ్యాచ్ నిర్వహించగా, బంగ్లా తొలుత బ్యాటింగ్ చేసి 119 పరుగులు చేసింది. భారత్ లక్ష్యాన్ని చేధించే క్రమంలో వర్షం అంతరాయం కలిగించింది.
దీంతో మ్యాచ్ ఫలితం రాకుండానే ముగింసింది. అయితే ఈ టోర్నీకి సంబంధించి ఇప్పటికే సెమీఫైనల్ జట్లు ఖరారయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, భారత్ టాప్-4లో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి.
తాజాగా సెమీఫైనల్ Semi Final షెడ్యూల్ కూడా అధికారికంగా ఖరారైంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా, నాలుగో స్థానంలో ఉన్న భారత్‌తో సెమీఫైనల్లో తలపడనుంది.
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 30న నవీ ముంబైలో జరగనుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బౌలర్లు అద్భుతంగా రాణించి దక్షిణాఫ్రికాను కేవలం 24 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌట్ చేశారు. అనంతరం బ్యాటర్లు 16.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
దీంతో ఆస్ట్రేలియా 13 పాయింట్లతో టేబుల్ టాప్‌లో నిలిచింది. టీమిండియా ప్రస్తుతం 7 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ గెలిచినా, ర్యాంక్ మాత్రం మారేది కాదు.
పాయింట్ల పట్టిక
ఆస్ట్రేలియా – 13 పాయింట్లు
ఇంగ్లాండ్ – 11 పాయింట్లు
దక్షిణాఫ్రికా – 10 పాయింట్లు
భారత్ – 7 పాయింట్లు
ఈ జట్లన్నీ ఇప్పటికే సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి.
సెమీఫైనల్ షెడ్యూల్
అక్టోబర్ 29: ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా – గువహటి
అక్టోబర్ 30: ఆస్ట్రేలియా vs భారత్ – నవీ ముంబై
రెండు మ్యాచ్‌లు కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి.
ICC Women World Cup : ఫైనల్ కోసం సమరం
ఇరు సెమీఫైనల్ల విజేతలు ఫైనల్లో తలపడనున్నారు. భారత జట్టు ఆస్ట్రేలియాతో Australia తలపడనుండగా, ఈ పోరులో విజయం సాధిస్తే, మరోసారి ప్రపంచకప్ ఫైనల్ బరిలో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం టీమిండియా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండగా, ఆస్ట్రేలియా అజేయంగా దూసుకుపోతోంది. కాబట్టి ఈ మ్యాచ్ ప్రేక్షకులకు పండగ కానుంది. ఇక టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 02న జరగనుంది.