అక్షరటుడే, వెబ్‌డెస్క్: ICC T20 World Cup 2026 | క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా (Team India) డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది.
భారత్–శ్రీలంక వేదికలపై జరుగుతున్న ఈ ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు కొనసాగనుంది. జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి, గ్రూప్ దశ తర్వాత సూపర్–8 మ్యాచ్‌ల రూపంలో పోటీలు నిర్వహించనున్నారు.
ICC T20 World Cup 2026 | తొలి రోజే డబుల్ ధమాకా
టోర్నీ తొలి రోజునే రెండు కీలక మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఐసీసీ ప్రణాళిక రూపొందించింది. ఉదయం 11 గంటలకు తొలి మ్యాచ్, రాత్రి 7 గంటలకు రెండో మ్యాచ్ జరగనుంది. గ్రూప్–ఏ జట్ల మధ్యే ఈ మ్యాచ్‌లు జరుగుతుండటం విశేషం. పాకిస్తాన్ జట్టు భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించడంతో, వారి మ్యాచ్‌లను శ్రీలంక (Srilanka) వేదికగా నిర్వహించేందుకు ఐసీసీ నిర్ణయించింది. అలాగే శ్రీలంక జట్టు గ్రూప్ మ్యాచ్‌లన్నీ కూడా ఆ దేశంలోనే జరగనున్నాయి. బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోవడంతో, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం కల్పించారు.
పాకిస్తాన్ – నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్ కొలంబోలోని ఎస్ఎస్సీ గ్రౌండ్లో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇటీవల ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన టీ20 సిరీస్‌ను 3–0తో గెలుచుకున్న పాకిస్తాన్ మంచి ఉత్సాహంతో టోర్నీలో అడుగుపెడుతోంది.
పాకిస్తాన్ అంచనా జట్టు:
సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్/షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, షాహీన్ షా అఫ్రిది, సల్మాన్ మిర్జా, ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్.
నెదర్లాండ్స్ అంచనా జట్టు:
మైకేల్ లెవిట్, మ్యాక్స్ ఓడౌడ్, కాలిన్ అకర్మన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), బాస్ డి లీడ్, జాక్ లయన్–కాచెట్, లోగన్ వాన్ బీక్, రూలాఫ్ వాన్ డెర్ మెర్వే, కైల్ క్లైన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకీరెన్.
ICC T20 World Cup 2026 | రాత్రి భారత్–యూఎస్ఏ పోరు
తొలి రోజు మూడో మ్యాచ్‌గా భారత్ – యూఎస్ఏ USA జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగుతుండగా, 2024 ఎడిషన్‌లో మంచి ప్రదర్శన చేసిన యూఎస్ఏ మరోసారి సత్తా చాటాలని చూస్తోంది.
టీమిండియా అంచనా జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
యూఎస్ఏ అంచనా జట్టు:
మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆండ్రీస్ గౌస్ (వికెట్ కీపర్), సాయితేజ ముక్కమల్ల, షయాన్ జహంగీర్, మిలింద్ కుమార్, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్, మొహమ్మద్ మొహ్సిన్, అలీ ఖాన్, నోస్తుష్ కెన్జిగే, సౌరభ్ నేత్రవల్కర్.
ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ టోర్నీ తొలి రోజే భారత్–పాక్ Pakistan జట్ల మ్యాచ్‌లతో ఆసక్తికరంగా ప్రారంభమవుతుండటం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.