అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ICC | పాకిస్తాన్ జట్టుకు (Pakistan team) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాక్ ఇచ్చింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 21న జరిగిన ఆసియా కప్ (Asia Cup) సూర్ ఫోర్ మ్యాచ్ లో భాగంగా రెచ్చగొట్టేలా వ్యవహరించిన పాక్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ (Harris Rauf ) మ్యాచ్ ఫీజులో 90 శాతం కోత విధించింది. అంతకు ముందు కూడా రవూఫ్ భారత అభిమానులను రెచ్చగొట్టేలా వివాదాస్పదమైన ‘6-0’ సంజ్ఞను చేస్తూ, విమానం పడిపోయినట్లు అనుకరించాడు.
దీనిపై బీసీసీఐ (BCCI).. ఐసీసీకి (ICC) ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ (referee Richie Richardson) మ్యాచ్ ఫీజులో కోత విధించారు. మరోవైపు, ఆ మ్యాచ్ సమయంలో సాహిబ్ జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ తర్వాత ‘గన్‌షాట్’ తో వేడుక చేసుకోవడంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోసారి ఇలా చేయొద్దనికి అతనికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. “మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ శుక్రవారం మధ్యాహ్నం విచారణను పూర్తి చేశాడు. దూకుడుగా ప్రవర్తించినందుకు హారిస్ రవూఫ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు. ఫర్హాన్‌ను హెచ్చరికతో వదిలేశారు” అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అంతకుముందు, ఐసిసి విచారణ సమయంలో రవూఫ్, ఫర్హాన్ ఇద్దరూ తమ ప్రవర్తతను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఐసీసీకి లిఖితపూర్వకంగా స్పందన తెలియచేసినప్పటికీ, ఇద్దరు ఆటగాళ్లు రిచర్డ్సన్ ముందు ప్రత్యక్షంగా హాజరయ్యారు. వారి వెంట జట్టు మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా (Naveed Akram Cheema) కూడా ఉన్నారు. తన ‘గన్‌షాట్ సెలబ్రేషన్’ పాకిస్తాన్‌లోని తన జాతి పఖ్తున్ తెగలో జరుపుకునే సాంప్రదాయమని ఫర్హాన్ వివరణ ఇచ్చాడు. గతంలో విరాట్ కోహ్లీ కూడా ఇదే విధంగా జరుపుకున్నాడని గుర్తు చేశాడు. దీంతో రిఫరీ అతడ్ని మందలించి వదిలేశారు.