Homeక్రైంACB Raids | వామ్మో వీడు మాములోడు కాదు.. ఏడు గుంటల భూమి కోసం రూ.12...

ACB Raids | వామ్మో వీడు మాములోడు కాదు.. ఏడు గుంటల భూమి కోసం రూ.12 లక్షల లంచం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | రాష్ట్రంలోని పలు తహశీల్దార్​ కార్యాలయాలు (Tahaseeldar offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. పలువురు రెవెన్యూ అధికారులు (Revenue Officers) పనుల కోసం తమ దగ్గరకు వచ్చే ప్రజలను లంచం పేరిట పట్టి పీడిస్తున్నారు.

ఎంతొస్తే అంత అన్నట్లు రూ.500 నుంచి మొదలు కొని రూ.లక్షల వరకు లంచం(Bribe) డిమాండ్​ చేస్తున్నారు. తాజాగా ఓ రెవెన్యూ ఇన్​స్పెక్టర్(Revenue inspector)​ ఏడు గుంటల భూమిని పట్టాదారు పాస్​బుక్​లో నమోదు చేసేందుకు రూ.12 లక్షల లంచం డిమాండ్​ చేశాడు. ఇంత మొత్తంలో నగదు డిమాండ్ చేయడంపై ఇటు ఏసీబీ అటు రెవెన్యూ అధికారులు విస్తుపోస్తున్నారు.

రంగారెడ్డి (RAngareddy) జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) తహశీల్దార్​ ఆఫీస్‌లో జి. కృష్ణ(RI Krishna) రెవెన్యూ ఇన్​స్పెక్టర్​గా పని చేస్తున్నాడు. ఒక వ్యక్తి పట్టా పాస్​బుక్​లో ఏడు గుంటల భూమి నమోదు కోసం తహశీల్దార్​ ఆఫీస్​లో సంప్రదించాడు. ఈ భూమి నమోదు కోసం రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ రూ.12 లక్షల లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇస్తే తహశీల్దార్​, ఆర్డీవో ఆఫీసుల్లో పని చక్కబెడతానని చెప్పాడు. దీంతో సదరు వ్యక్తి కుమారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్​ ఆఫీసులో సోదాలు చేశారు. అనంతరం నిందితుడు ఆర్​ఐ కృష్ణను అరెస్ట్ చేశారు.

కాగా.. హైదరాబాద్​లోని ముషీరాబాద్ (Musheerabad)​ తహశీల్దార్​ ఆఫీసులో రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ భూపాల మహేశ్​ సైతం బుధవారం అరెస్టయిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​ కోసం ఆయన రూ.లక్ష లంచం డిమాండ్​ చేశాడు. రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా మహేశ్​ను ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ACB Raids | భయపడొద్దు.. అండగా ఉంటాం

ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్​కు ఫోన్​ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.