అక్షరటుడే, వెబ్డెస్క్: IBomma Ravi | ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు (Nampally Court) షాక్ ఇచ్చింది. అతడి బెయిల్ పిటిషన్ను జడ్జి కొట్టివేశారు.సినిమా పైరసీ కేసులో ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్చేసిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు, ఇతర భాషల చిత్రాలను సైతం అతడు పైరసీ చేసి తన వెబ్సైట్ ఐబొమ్మలో పెట్టేవాడు.
అంతేగాకుండా బప్పం టీవీని సైతం నిర్వహించేవాడు. పోలీసులు సైట్ను బ్లాక్ చేసిన మిర్రర్ సైట్లు సృష్టిస్తూ సినీ ఇండస్ట్రీ (Film Industry)కి భారీగా నష్టం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు ఇమ్మడి రవిని గతంలో అదుపులోకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకొని కీలక వివరాలు సేకరించారు. అయితే పోలీస్ కస్టడి ముగియడంతో ప్రస్తుతం అతడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించాడు.
IBomma Ravi | దేశం దాటిపోతాడని..
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (Cyber Crime Police Station)లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని చెప్పారు. బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
IBomma Ravi | బెట్టింగ్ యాప్ల ద్వారా
ఇమ్మడి రవి సినిమాలను పైరసీ చేయడం ద్వారా భారీగా డబ్బులు సంపాదించాడు. బెట్టింగ్ యాప్ (Betting App)ల ద్వారా అతడికి ఆదాయం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ డబ్బులను విలాసవంతమైన జీవితం గడపడానికి రవి ఖర్చు చేశాడు. అయితే కూకట్పల్లిలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు బ్యాంక్ అకౌంట్లోని రూ.3 కోట్లో స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.