ePaper
More
    Homeటెక్నాలజీIBM CEO | ఐబీఎంలో 8,000 ఉద్యోగాలు ఊస్టింగ్.. అంతా ఏఐ ఎఫెక్ట్

    IBM CEO | ఐబీఎంలో 8,000 ఉద్యోగాలు ఊస్టింగ్.. అంతా ఏఐ ఎఫెక్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:IBM CEO | కృత్రిమ మేధస్సు (AI) ఎఫెక్ట్ తో కార్పొరేట్ ఉద్యోగాలు ఊస్టింగ్ అవుతున్నాయి. ఇక జాబ్ సెక్యూరిటీ అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.

    తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం సంస్థ(IBM company) దాదాపు 8,000 ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపులలో ఎక్కువగా హ్యూమన్ రీసోర్సెస్ (HR) విభాగంలోని ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగాలను ఏఐ(AI) భర్తీ చేస్తోందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. IBM ఇటీవల తన హెచ్‌ఆర్ కార్యకలాపాలలో ఏఐ వ్యవస్థలను విస్తృతంగా ప్రవేశపెట్టింది. ఇప్పటికే 200 హెచ్‌ఆర్ ఉద్యోగాలను ఇంటెలిజెంట్ ఏఐ సాఫ్ట్‌వేర్ ఏజెంట్లు భర్తీ చేశాయి.

    IBM CEO | ఏఐ తెచ్చిన తంటా..

    ఈ ఏఐ ఏజెంట్లు డేటా సరిపోల్చుకోవడం, ఉద్యోగుల ప్రశ్నలకు స్పందించడం, డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ వంటి పునరావృత పనులను నిర్వహిస్తుండ‌డం జ‌రుగుతుంది. ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ IBM Aravind Krishna మాట్లాడుతూ.. ఈ మార్పులు వ్యాపార వృద్ధికి అవసరమైన విభాగాలకు మూలధనాన్ని మళ్లించడం వల్ల జరిగినవిగా చెప్పుకొచ్చారు.

    “AI వల్ల మేం కొంత ఆదా చేసాం. ఈ ఆదా వల్ల మేం డెవలప్‌మెంట్, మార్కెటింగ్, సెల్స్ విభాగాలలో మరింత పెట్టుబడులు పెట్టగలగాం” అని చెప్పారు. మేము 30% వరకు ఉద్యోగాలను AI మరియు ఆటోమేషన్ ద్వారా భర్తీ చేయగలం. ఇది సుమారు 7,800 ఉద్యోగాలకు సమానం,” అని తెలిపారు.

    IBM చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ నికెల్ లా‌మోరో ప్రకారం, “పూర్తిగా ఉద్యోగాలు పోవు. రిపిటేటివ్ పనులు ఏఐ చేత జరుగుతాయి. మానవ ఉద్యోగులు వ్యూహాత్మక నిర్ణయాలలో భాగమవుతారు” అని తెలిపారు. అయితే ఇప్పుడు కేవలం ఐబీఎం మాత్రమే కాదు ఇతర సంస్థలు కూడా ఏఐ రాకతో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.

    Duolingo ఇటీవల కంటెంట్ మాడరేషన్‌లో మానవ ఉద్యోగుల స్థానంలో ఏఐ టూల్స్‌ను ప్రవేశపెట్టింది. Shopify CEO Tobias Lütke కూడా మానవులను నియమించే ముందు ఏఐ ఆ పని చేయగలదా అనే ప్రశ్న వేసుకోవాలి అని చెప్పడం మార్కెట్ పోకడలు ఎలా ఉన్నాయనేది వివరిస్తుంది. చూస్తుంటే రానున్న రోజుల‌లో ఉద్యోగాలన్నీ కూడా ఏఐ ఎఫెక్ట్‌తో ఉష్ అవడం ఖాయంగా క‌నిపిస్తుంది.

    More like this

    Teenmar Mallanna comments | ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న ఘాటైన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!

    Teenmar Mallanna comments | భారాస నుంచి తిరస్కరణకు గురైన ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు...

    Pawan birthday celebrations | ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు: Pawan birthday celebrations : పవర్​ స్టార్ Power Star​, ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh ఉప...

    MLC Kavitha future | పొమ్మన్న పుట్టినిల్లు.. వద్దన్న మెట్టినిల్లు.. ఢోలాయమానంలో ఎమ్మెల్సీ కవిత భవిత!

    అక్షరటుడే, హైదరాబాద్: MLC Kavitha future : ఇందూరు కోడలు, ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది....