అక్షరటుడే, వెబ్‌డెస్క్: IAS transfer | తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. వారిని ట్రాన్స్ఫర్ చేస్తూ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణా రావు (Chief Secretary Ramakrishna Rao) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ ఎం.రఘునందన్‌రావు (M.Raghunandan Rao) కమర్షియల్ టాక్స్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
అలాగే ఎస్ హరీశ్‌ను (S Harish) దేవాదాయశాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. భవేష్ మిశ్రాకు (Bhavesh Mishra) భూగర్భ గనులశాఖ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. కాంత్రి వల్లూర్‌ను పదవి నుంచి తప్పించింది. అంతేకాకుండా దేవాదాయ శాఖ నుంచి శైలేజా రామయ్యను ప్రభుత్వం రిలీవ్ చేసింది. సిద్దిపేట అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్(Garima Agarwal)ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేసింది. కాగా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
