అక్షరటుడే, హైదరాబాద్: IAS Officers Transfers | పరిపాలనా అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం Telangana state government పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (SPL-A) G.O.Rt.No.1806 ద్వారా ఆదేశించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ & సీఈఓ (ఇండస్ట్రీ & ఇన్వెస్ట్మెంట్ సెల్, సీఎంవో – SPEED)గా పనిచేస్తున్న జయేష్ రంజన్ (1992 బ్యాచ్) ను హెచ్ఎండీఏ (HMDA) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఈ పదవిలో కొనసాగుతున్న కె. రామకృష్ణ రావు, ఐఏఎస్ (1991) ను రిలీవ్ చేసింది. జయేష్ రంజన్ వైఏటీ అండ్ సీ, క్రీడల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, పురావస్తు శాఖ డైరెక్టర్గా FAC బాధ్యతలు నిర్వర్తిస్తారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ & సీఈఓ (SPEED) గా కె. రామకృష్ణ రావు FACగా కొనసాగుతారు.
IAS Officers Transfers | జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్ల బదిలీలు
- భోర్కడే హేమంత్ సహదేవ్రావు (ఐఏఎస్ – 2018) : సేరిలింగంపల్లి
- అపూర్వ్ చౌహాన్ (ఐఏఎస్ 2020) : కూకట్పల్లి
- సందీప్ కుమార్ ఝా (ఐఏఎస్ 2014) : కుత్బుల్లాపూర్
- ప్రియాంక అలా (ఐఏఎస్ 2016) : ఖైరతాబాద్
- అనురాగ్ జయంతి (ఐఏఎస్ 2015) : రాజేంద్రనగర్
- హేమంత కేశవ్ పటిల్ (ఐఏఎస్ 2019) : ఎల్బీనగర్
- సంచిత్ గంగ్వార్ (ఐఏఎస్ 2021) : మల్కాజ్గిరి
- రాధిక గుప్తా (ఐఏఎస్ 2021) : ఉప్పల్ (మల్కాజ్గిరి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) FACగా బాధ్యతలు నిర్వర్తిస్తారు)
- ఎస్. శ్రీనివాస్ రెడ్డి : చార్మినార్
- జి. ముకుంద రెడ్డి : గోల్కొండ
- ఎన్. రవి కిరణ్ : సికింద్రాబాద్
- కె. చంద్రకళ (ఆర్డీఓ) : శంషాబాద్
IAS Officers Transfers | ఇతర బదిలీలు
- ఎం. హరిత (ఐఏఎస్ 2013) : టీజీపీఎస్సీ సెక్రటరీగా నియామకం
- నారాయణ అమిత్ మాలెంపాటి (ఐఏఎస్ 2022) : నారాయణపేట అదనపు కలెక్టర్
- ఏ. నిర్మల కాంతి వెస్లీ (ఐఏఎస్ 2016) : ఉపాధి & శిక్షణ శాఖ డైరెక్టర్ (FAC)
- ఈ.వి. నర్సింహారెడ్డి (ఐఏఎస్ 2017) : ముసీ నది అభివృద్ధి సంస్థ (MRDCL) ఎండీ
- భవేశ్ మిశ్రా (ఐఏఎస్ 2015) : ఇండస్ట్రీ & ఇన్వెస్ట్మెంట్ సెల్ అదనపు సీఈఓ (FAC)
- బీ. షఫియుల్లా (ఐఎఫ్ఎస్ 2003) : మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ల వీసీ & ఎండీ (FAC)
- పి. కధిరావన్ (ఐఏఎస్ 2020) : హైదరాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)
- జి. జితేందర్ రెడ్డి : హైదరాబాద్ అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)