133
అక్షరటుడే, హైదరాబాద్: IAS officers transfers | తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన అత్యవసర పరిస్థితుల్లో ఈ IAS అధికారుల బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
IAS officers transfers | ఐఏఎస్‌ల బదిలీ
- పీఆర్ & ఆర్డీ డైరెక్టర్ శ్రీజన (IAS – 2013)ను జీహెచ్ఎంసీ (కూకట్పల్లి, సెర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు) అదనపు కమిషనర్‌గా బదిలీ చేశారు.
- WCD & SC, డైరెక్టర్ శ్రుతి ఓజా (IAS – 2013)కు PR & RD డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
- నిజామాబాద్ కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ టి. వినయ్ కృష్ణారెడ్డి (ఐఏఎస్ 2013) ను జీహెచ్ఎంసీ (మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లు) అదనపు కమిషనర్‌గా బదిలీ చేశారు.
- నల్గొండ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఇలా త్రిపాఠి (IAS (2017)ని నిజామాబాద్, కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమించారు.
- సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు ( IAS 2018) కు నల్గొండ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
- తాండూర్(వికారాబాద్) సబ్-కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ (IAS 2022)కు నారాయణపేట అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బాధ్యతలు అప్పగించారు.