HomeతెలంగాణIAS officers | సీఎం రేవంత్​ కాళ్లు మొక్కిన ఐఏఎస్​ అధికారి.. మండిపడ్డ సీఎస్​

IAS officers | సీఎం రేవంత్​ కాళ్లు మొక్కిన ఐఏఎస్​ అధికారి.. మండిపడ్డ సీఎస్​

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: IAS officers : తెలంగాణలో ఐఏఎస్ అధికారి శరత్ ias Sharath.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాళ్ళు మొక్కిన ఉదంతం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు స్పందించాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

కాగా.. ఈ అంశంపై సీఎస్ రామకృష్ణారావు(CS Ramakrishna Rao) తాజాగా స్పందించారు. ఈ ఘటనపై మండిపడ్డారు. రాజకీయ నాయకులతో ఐఏఎస్ అధికారులు ఉన్నపుడు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఉద్దేశించి సీఎస్ హెచ్చరించారు. ఇటీవల ప్రభుత్వ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్ఠ దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐఏఎస్ అధికారులు(IAS officers) ఆల్ ఇండియా సర్వీసెస్(All India Services) ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదని హితవు పలికారు. ఇకమీదట రాజకీయ సమావేశాలలో ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.

Must Read
Related News