ePaper
More
    HomeతెలంగాణIAS Officer | సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కిన ఐఏఎస్..దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తే తీవ్ర‌మైన చ‌ర్య‌లు

    IAS Officer | సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కిన ఐఏఎస్..దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తే తీవ్ర‌మైన చ‌ర్య‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IAS Officer | తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి Revanth reddy.. సోమవారం నాగర్‌ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పర్యటించిన విష‌యం తెలిసిందే. అచ్చంపేటలోని అమ్రాబాద్‌ మండలం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలో గ్రామంలో నిర్మించిన సీతారామాంజ‌నేయ స్వామి ఆల‌యాన్ని(Sitaramanjaneya Swamy temple) ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు కూడా చేశారు. అనంత‌రం ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన‌గా, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పని చేస్తున్న ఐఏఎస్ ఏ.శరత్(IAS A.Sharath) ఆయన కాళ్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపుతోంది. ఒక ఐఏఎస్ అధికారి(IAS Officer) హోదాలో ఉన్న వ్యక్తి.. ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకోవడం ఏంటనే విమర్శలు వ్య‌క్తం అవుతున్నాయి.

    IAS Officer | పెద్ద వివాదం..

    ఐఏఎస్‌ కాళ్లు మొక్కిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గమనించనట్టు తెలుస్తోంది. కానీ సదరు ఐఏఎస్‌ అధికారి అలా చేయ‌డంతో తెలంగాణ సీఎస్ రామ‌కృష్ణ (CS Rama Krishna) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులతో ఉన్నపుడు బాధ్యతగా వ్యవరించాలి అంటూ మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్(All India Services) ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదని.. ప్రజా సమావేశాల్లో పాల్గొన్నప్పుడు అనుచిత ప్రవర్తన మానుకోవాలంటూ హెచ్చ‌రించారు. ఐఏఎస్ అధికారులే ఇలా ప్రవర్తిస్తే ప్రజల్లో అధికారుల పట్ల ఉన్న నమ్మకం తగ్గుతుందని , అధికారి ఎల్లప్పుడు పరిపూర్ణ నిజాయితీతో ఉండాలని సూచించింది.

    ఒక‌వేళ అలా కాకుండా 1968 ఎఐఎస్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఎవ‌రైన‌ ఇలాంటి చర్యలకి పాల్ప‌డితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఐఏఎస్ IASఅధికారుల అనుచిత ప్రవర్తనపై క్రమశిక్షణ చర్యలు తప్పవని..ప్రజల్లో గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అధికారుల తీరు మారాలని సీఎస్(CS) చాలా గట్టిగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా 1964 తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్(Telangana Civil Services Rules) అతిక్రమించొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ నాయకులతో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కే రామకృష్ణారావు పేర్కొన్నారు.

    More like this

    Bajireddy Govardhan | జర్నలిస్ట్ నారాయణ మృతదేహానికి బాజిరెడ్డి నివాళి

    అక్షరటుడే, డిచ్​పల్లి: Bajireddy Govardhan | మండలంలోని ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ లక్కవత్రి నారాయణ (Lakkavatri Narayana) గుండెపోటుతో...

    Rashtrapati Bhavan | ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు.. రాష్ట్రపతి భవన్ వేదికగా కార్యక్రమం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rashtrapati Bhavan | ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) శుక్రవారం...

    BC Declaration | బీసీ రిజర్వేషన్లపై బీజేపీవి తప్పుదోవ పట్టించే మాటలు..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BC Declaration | బీసీ రిజర్వేషన్​పై (BC Reservation) తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు...