HomeతెలంగాణIAS Amrapali | ఐఏఎస్ ఆమ్రపాలి మళ్లీ వచ్చేస్తోంది..

IAS Amrapali | ఐఏఎస్ ఆమ్రపాలి మళ్లీ వచ్చేస్తోంది..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Amrapali | ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలికి (IAS officer Amrapali) క్యాట్‌లో ఊరట లభించింది. ఆమెకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది.

ఆమ్రపాలిని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్‌ ఉత్తర్వులు (CAT orders) జారీ చేసింది. డీవోపీటీ ఉత్తర్వులతో 4 నెలల కిందట ఏపీకి వెళ్లిన ఆమె.. తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్‌లో పిటిషన్‌ వేసింది. తాజాగా ఆమెకు అనుకూలంగా క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

IAS Amrapali | గతంలో కీలక బాధ్యతలు

కాగా.. ఆమ్రపాలి 2023 తెలంగాణ ఎన్నికల అనంతరం కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యి తెలంగాణకు వచ్చారు. 2023 డిసెంబర్ 14న హెచ్ఎండీఏ (HMDA) కమిషనర్‌గా, మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌చార్జ్‌ ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాంగ్రెస్​ ప్రభుత్వం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది.

అయితే ఆమెను ఆంధ్రప్రదేశ్​కు కేటాయిస్తూ.. డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం రిలీవ్​ చేసింది. దీంతో నాలుగు నెలల క్రితం ఆమె ఏపీలో జాయిన్​ అయ్యారు. తాజాగా క్యాట్​ ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో మళ్లీ తెలంగాణకు రానున్నారు. కాగా.. తిరిగి ఆమెకు కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.