HomeజాతీయంIAF Air Show | చికెన్​ నెక్​ సమీపంలో గర్జించిన ఐఏఎఫ్​

IAF Air Show | చికెన్​ నెక్​ సమీపంలో గర్జించిన ఐఏఎఫ్​

IAF Air Show | ఈశాన్య భారత్​ ప్రాంతంలో వాయుసేన తొలిసారి పూర్తిస్థాయి వైమానిక ప్రదర్శన చేపట్టింది. అసోంలో ఈ విన్యాసాలు నిర్వహించింది. 

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IAF Air Show | ఈశాన్య భారత్​ ప్రాంతంలో వాయుసేన తొలిసారి పూర్తిస్థాయి వైమానిక ప్రదర్శన (IAF Air Show) చేపట్టింది. అసోం Assam లో ఈ విన్యాసాలు నిర్వహించింది.

గువాహటి గగనతలం Guwahati airspace పై అద్భుతం ఆవిష్కృతం అయింది. ఐఏఎఫ్ యుద్ధవిమానాలు IAF fighter jets గర్జిస్తూ దూసుకెళ్లాయి. ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

IAF Air Show | 93వ వార్షికోత్సవం..

భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఫ్లయింగ్ డిస్ప్లే 2025’ పేరుతో ఈ గగనతల ప్రదర్శన చేపట్టారు.

సుఖోయ్-30, రఫేల్, మిగ్-29, ఐఎల్-78 రీఫ్యూయలర్, మిరాజ్, సీ-17 గ్లోబ్మాస్టర్, ఆంటనోవ్ ఏఎన్-32, సీ-130 హర్క్యూలస్, ఎంఐ-17, అపాచీ, ఏఎల్ హెచ్-ఎంకే1.. తదితర గగన సేనల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఆ రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య Governor Laxman Prasad Acharya, సీఎం హిమంత బిశ్వశర్మ CM Himanta Biswas Sharma, సైనికాధికారులు ఈ వైమానిక ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

చికెన్ నెక్ కారిడార్ (సిలీగుడీ కారిడార్) Chicken Neck Corridor (Siliguri Corridor) సమీపంలో గగనతల ప్రదర్శన ఆకట్టుకుందన్నారు. మన వాయుదళం శక్తిసామర్ధ్యాల విన్యాసాలు శత్రు దేశాలకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతుందన్నారు.

 

Must Read
Related News