ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | నీళ్లు కూడా తాగను.. అరెస్ట్​ చేసినా దీక్ష కొనసాగిస్తా : ఎమ్మెల్సీ...

    MLC Kavitha | నీళ్లు కూడా తాగను.. అరెస్ట్​ చేసినా దీక్ష కొనసాగిస్తా : ఎమ్మెల్సీ కవిత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్​లోని ఇందిరా పార్క్​ వద్ద గల ధర్నా చౌక్​లో ​(Dharna Chowk) నిరాహార దీక్ష ప్రారంభించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్​ కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తూ 72 గంటల దీక్ష చేపట్టారు. అంతకుముందు ఆమె అంబేడ్కర్​, పూలే, ప్రొఫెసర్​ జయశంకర్​ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దీక్ష సందర్భంగా 72 గంటల పాటు తాను నీళ్లు కూడా తీసుకోనని తెలిపారు.

     MLC Kavitha | బీసీల ఆత్మగౌరవ పోరాటం

    జనాభాలో సగం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు (BC Reservations) అంతమేర ఇవ్వాలని కవిత డిమాండ్​ చేశారు. ఇది రాజకీయ పోరాటం కాదని, బీసీల ఆత్మగౌరవ పోరాటం అని ఆమె అన్నారు. దీక్షకు తనకు 72 గంటల పాటు అనుమతి ఇవ్వాలని కోరారు. నీరు కూడా తీసుకోకుండా చేపడతానని పేర్కొన్నారు. ఒకవేళ పోలీసులు అరెస్ట్​ చేసి స్టేషన్​కు తీసుకెళ్లిన, ఇంటికి పంపినా దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

     MLC Kavitha | బీసీలకు రాజకీయ ప్రాధాన్యం దక్కాలి

    జనాభాలో సగం ఉన్న బీసీలకు రాజకీయాల్లో సగ భాగం ప్రాధాన్యం ఇవ్వాలని కవిత డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టి కేంద్రంపై ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్​రెడ్డికి (CM Revanth Reddy) బీసీలపై ప్రేమ ఉంటే.. ముస్లింలకు ప్రత్యేకంగా రిజర్వేషన్​ డిక్లేర్​ చేయాలని డిమాండ్​ చేశారు. బీసీ బిల్లుపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలను సీఎం నివృత్తి చేయాలన్నారు. ముస్లింలకు కాకుండా బీసీలకే 42శాతం రిజర్వేషన్​ ఇస్తామని ప్రకటించాలన్నారు.

     MLC Kavitha | ప్రభుత్వం భయపడుతోంది

    తాము దీక్షలు చేస్తామంటే ప్రభుత్వం భయపడుతోందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. 72 గంటల దీక్షకు పర్మిషన్​ అడిగితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఇచ్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే దీక్షలకు అనుమతి ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. సమైఖ్యాంధ్ర పాలకులు కూడా దీక్షకు పర్మిషన్​ ఇచ్చారన్నారు. తమకు 72 గంటల దీక్షకు అనుమతి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అనుమతి కోసం ఇప్పటికే కోర్టులో పిటిషన్​ వేశామన్నారు.

    Latest articles

    Today Gold Price | అతివ‌లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధరలు మహిళ‌ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్చ్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణలో (Telangana) మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు చేరబోతున్నాయి. అది...

    More like this

    Today Gold Price | అతివ‌లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధరలు మహిళ‌ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...