అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipality Elections | కామారెడ్డి మున్సిపాలిటీలోని పదోవార్డులో ప్రజలకు తాను నిరంతరం అందుబాటులో ఉంటానని దేవునిపల్లి (Devanpally) పదో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నీలం కళావతి రమేష్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆమె వార్డులో ప్రచారం నిర్వహించారు.
తాను కౌన్సిలర్‌గా గెలిస్తే పూర్తిస్థాయిలో వార్డు ప్రజలకు సేవ చేసేందుకు అందుబాటులో ఉంటానని కళావతి రమేష్ (Kalavathi Ramesh) అన్నారు. తాను బీకాం, బీఈడీ చదివానన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ఉన్నందున ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించాలన్నారు. తన భర్త నీలం రమేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడని.. తన మరిది సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వార్డు మెంబరుగా గెలిచి ప్రజలకు సేవా చేశాడన్నారు.
Kamareddy Municipality Elections | వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
ఈసారి జరిగే ఎన్నికల్లో తనను 10వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని కళావతి తెలిపారు. ప్రజలకు 24 గంటలు గ్రామంలోనే అందుబాటులో ఉంటానన్నారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ (Congress party) ఉన్నందున తనను గెలిపిస్తే నిధులు తీసుకొచ్చి వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Kamareddy Municipality Elections | పేద కుటుంబాలపై ప్రత్యేక దృష్టి
వార్డులో ఉన్న పేద ప్రజలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వెల్లడించారు. వార్డులో నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన వారికి పింఛన్లు ఇప్పిస్తానన్నారు. వార్డులో సమస్యలు లేకుండా చూస్తానన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కౌన్సిలర్‌గా గెలిచిన తర్వాత 10వ వార్డుకు ప్రత్యేకంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తానని కళావతి తెలిపారు. ఫౌండేషన్ ద్వారా చదువుకునే పిల్లల భవిష్యత్తుకు అవసరమయ్యే ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తానన్నారు. వార్డులో బస్తీ దవాఖానా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఒక అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తానన్నారు. ఈ ఏడాది వార్డులో ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి ల్యాప్‌టాప్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తానన్నారు.
Kamareddy Municipality Elections | సమస్యలు వస్తే ముందుండి పరిష్కరిస్తా..
ప్రజలు ఏ సమస్య ఉన్నా వార్డు కార్యాలయంలో విన్నవిస్తే పరిష్కరించే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేస్తుకుంటున్నామన్నారు. వార్డులో ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన ఆడపిల్ల పెళ్లికి పుస్తె మట్టెలు అందిస్తానని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారంపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కారం చూపుతానని, ప్రజలు ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. అధికార పార్టీలో ఉన్నందున నిధులు పుష్కలంగా వచ్చే అవకాశం ఉందని, అభివృద్ధి కోసం తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.