అక్షరటుడే, కామారెడ్డి: TPCC | తనపై నమ్మకంతో టీపీసీసీ కార్యదర్శిగా అవకాశం కల్పించారని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతగా పని చేస్తానని టీపీసీసీ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను 45 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్నానన్నారు.
పార్టీలో అందరిని కలుపుకుని ముందుకు సాగుతానన్నారు. తనకు పదవి లభించడంలో కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Government Advisor Shabbir Ali), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు(State In-charge Meenakshi Natarajan) కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ (District Library Chairman) మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
