Homeజిల్లాలుకామారెడ్డిKasula Balaraj | మున్నూరు కాపుల ఎదుగుదలకు కృషి చేస్తా..

Kasula Balaraj | మున్నూరు కాపుల ఎదుగుదలకు కృషి చేస్తా..

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Kasula Balaraj | మున్నూరుకాపుల అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తామని ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల బాలరాజ్​ పేర్కొన్నారు. బీర్కూరు (Birkoor) మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గురువారం కాసుల బాలరాజ్​ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్నూరుకాపులు (Munnuru kapu caste) ఐక్యంగా ఉండాలని.. ప్రతి గ్రామంలో మున్నూరు కాపు కళ్యాణ మండపాల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

జనాభా ప్రాతిపదికన మున్నూరు కాపులు రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్నప్పటికీ రాజకీయపరంగా వెనుకబడ్డారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ ప్రకాష్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ యామ రాములు, మున్నూరు కాపు మండలాధ్యక్షుడు మేకల విఠల్, ఆయా గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News