359
అక్షరటుడే, ఇందూరు : Yadala Naresh | నగరంలోని ఐదో డివిజన్ (Fifth Division) అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి యాదాల నరేశ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) భాగంగా సోమవారం డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు అభివృద్ధికి చేపట్టే పనులను వివరించారు.
ఐదో వార్డు ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. స్థానిక నాయకుడిగా ఇక్కడి ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు. తనను కార్పొరేటర్ (Corporator)గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు.