అక్షరటుడే, వెబ్‌డెస్క్: Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలు వస్తే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫును ఎమ్మెల్యేగా గెలిచిన దానం తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు.
ఎంపీ ఎన్నికల్లో (MP Elections) హస్తం పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ప్రస్తుతం స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) వద్ద ఆయన అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు దానం విచారణకు హాజరు కాలేదు. మిగతా ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ (BRS)లోనే ఉన్నామని స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. దీంతో ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. అయితే దానం మాత్రం కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయడంతో ఆయనపై వేటు పడే అవకాశం ఉంది. దీంతో ముందుగానే ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Danam Nagender | ఆరుసార్లు గెలిచా..
తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు దానం తెలిపారు. శనివారం ఉదయం కార్యకర్తలతో మాట్లాడారు. ఉపఎన్నిక వస్తే మళ్లీ గెలుస్తానని పేర్కొన్నారు. కార్యకర్తల అండతోనే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు చెప్పారు. తాను రాజీనామా చేయడానికి, ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి కార్యకర్తలేనని తన ధైర్యం అన్నారు. దీంతో ఆయన త్వరలో రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అధిష్టానం సూచన మేరకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయనున్నట్లు సమాచారం.
Danam Nagender | కేటీఆర్‌కు కౌంటర్
సీఎం రేవంత్ (CM Revanth)పై కేటీఆర్ వ్యాఖ్యలకు దానం కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవికి బీఆర్ఎస్ నేతలు గౌరవం ఇవ్వడం లేదని దానం అన్నారు. సీఎంను ఏకవచనంతో మాట్లాడడం సరికాదన్నారు. కాగా శుక్రవారం కేటీఆర్ (KTR) రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనను కట్టేయాలని, లేకపోతే ఎవరినైన కరుస్తారని అన్నారు. ఈ క్రమంలో దానం స్పందిస్తూ సీఎం పదవికి గౌరవం ఇవ్వాలన్నారు. విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని బీఆర్ఎస్ నాయకులకు చెప్పారు.