అక్షరటుడే, వెబ్డెస్క్ : Rahul Gnadhi | ఎన్నికల సంఘంపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈసారి ఆరోపణలను తీవ్రతను మరింత పెంచారు. ఓట్ల చోరీపై త్వరలో హైడ్రోజన్ బాంబు(Hydrogen Bomb) లాంటి వాస్తవాలు వెల్లడిస్తానని చెప్పారు. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి తన ముఖం చూపించలేరన్నారు.
బీహర్ లో ఆయన చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర(Voter Adhikar Yatra) ముగింపు సందర్భంగా సోమవారం పాట్నాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. “బీజేపీ నా మాట వినాలి. మీరు అణు బాంబు గురించి విన్నారా? నేను దానిని విలేకరుల సమావేశంలో చూపించాను. ఇప్పుడు, అంతకంటే పెద్దది ఉంది హైడ్రోజన్ బాంబు. మీరందరూ దానికి సిద్ధంగా ఉండాలి. ఓటు చోరీ గురించి నిజాలు దేశ ప్రజల ముందుకు రానున్నాయి. ఆ హైడ్రోజన్ బాంబు తర్వాత, ప్రధాని మోదీ(Prime Minister Modi) దేశానికి తన ముఖం చూపించలేరు” అని అన్నారు.
Rahul Gnadhi | రాజ్యాంగాన్ని హత్య చేసే యత్నం..
రాహుల్(Rahul Gnadhi) మరోసారి ఆర్ ఎస్ ఎస్పై ఆరోపణలు గుప్పించారు. మహాత్మా గాంధీని హత్య చేసిన అదే శక్తులు ఇప్పుడు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. “ఏం జరిగినా రాజ్యాంగాన్ని హత్య చేయడానికి మేము వారిని అనుమతించము. బీహార్ ఒక విప్లవాత్మక రాష్ట్రం. ఇది మొత్తం దేశానికి సందేశం పంపింది- ‘ఓటు దొంగతనం’ జరగనివ్వము” అని పేర్కొన్నారు.
Rahul Gnadhi | చైనా పర్యటనపైనా విమర్శలు..
ప్రధాని మోదీ చైనా పర్యటనపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు, “ఓటు చోర్, గడ్డి చోడ్” అనే నినాదం భారతదేశానికే పరిమితం కాదని, బీజింగ్కు కూడా చేరుకుందన్నారు. “ఓటు చోర్ గడ్డి చోడ్, బీహార్(Bihar) మే నయా నారా చాలా హై (బీహార్లో కొత్త నినాదం ఉంది), ‘ఓటు చోర్, గడ్డి చోడ్’…చైనా, అమెరికాలో కూడా ప్రజలు ‘ఓటు చోర్, గడ్డి చోడ్’ అంటున్నారు” అని రాహుల్ గాంధీ తెలిపారు.