HomeUncategorizedNetanyahu | ట్రంప్‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాలో మోదీకి చెబుతా.. ఇజ్రాయిల్ ప్ర‌ధాని నెత‌న్యాహు

Netanyahu | ట్రంప్‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాలో మోదీకి చెబుతా.. ఇజ్రాయిల్ ప్ర‌ధాని నెత‌న్యాహు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Netanyahu | అమెరికా, భారతదేశం మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేప‌థ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)తో ఎలా డీల్ చేయాలో త‌న‌కు తెలుస‌ని, ఆయా వివ‌రాల‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Modi)కి చెబుతాన‌న్నారు. మోదీ, ట్రంప్ ఇద్దరూ తనకు అద్భుతమైన స్నేహితులు కాబట్టి తాను వ్యక్తిగతంగా మోదీకి కొన్ని స‌ల‌హాలు ఇస్తానని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే ఇండియా ప‌ర్య‌ట‌న‌కు రావాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. “ప్రధాని మోడీ, ట్రంప్ నాకు అద్భుతమైన స్నేహితులు. ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలో నాకు బాగు తెలుసు. దీనిపై నేను ప్రధాని మోదీకి కొన్ని సలహాలు ఇస్తాను, కానీ వ్యక్తిగతంగా” అని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

Netanyahu | బ‌ల‌మైన సంబంధాలు..

అమెరికా-భారతదేశం(America-India) మ‌ధ్య బ‌ల‌మైన సంబంధాలు ఉన్నాయ‌ని నెతన్యాహు(Netanyahu) తెలిపారు. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్న సుంకాల సమస్యను త్వ‌ర‌గా పరిష్కరించుకోవాలని ఆయ‌న కోరారు. “రెండు దేశాల మ‌ధ్య బ‌ల‌మైన, దృఢ‌మైన సంబంధాలు ఉన్నాయి. ఇండియా, అమెరికా ఒకే వేదిక‌పైకి వ‌చ్చి సుంకాల సమస్యను పరిష్కరించుకోవడం ద్వారా ఇరువురికి చాలా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రెండు దేశాలు మన స్నేహితులు కాబట్టి అలాంటి తీర్మానం ఇజ్రాయెల్‌(Israel)కు కూడా మంచిది” అని ఆయన పేర్కొన్నారు.

రష్య నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను ట్రంప్ ఇటీవ‌ల భార‌త్‌పై 25 శాతం సుంకాలు విధించారు. దీనికి తోడుగా మ‌రో 25 శాతం టారిఫ్‌లు(Tariffs) విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ట్రంప్ నిర్ణ‌యం వ‌ల్ల వస్త్రాలు, సముద్ర ఎగుమతులు వంటి అనేక రంగాలను దెబ్బతీసే అవకాశం ఉన్న నేప‌థ్యంలో అమెరికా తీరును భార‌త్ తీవ్రంగా ఖండించింది.

Must Read
Related News