అక్షరటుడే, ఇందూరు: Tatikonda Naresh | నగరంలోని 35వ డివిజన్‌పై తనకు పూర్తి అవగాహన ఉందని.. ప్రజల మధ్యే ఉండి సేవచేసే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ నరేశ్ (Tatikonda Naresh) అన్నారు. ఈ మేరకు శుక్రవారం హమాల్వాడిలో ప్రచారం నిర్వహించారు.
అభివృద్ధికి బాటలు వేస్తా..
ఈ సందర్భంగా తాటికొండ నరేశ్ కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రజల మధ్యే ఉంటానని.. డివిజన్‌కు రావాల్సిన నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
పదేళ్లలో ఎంతో అభివృద్ధి..
బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (former MLA Bigala Ganesh Gupta) ఆధ్వర్యంలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందని నరేశ్ వివరించారు. ప్రతి డివిజన్‌కు రూ.కోట్లల్లో నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అదే స్ఫూర్తితో డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.