అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అన్యాయానికి గురవుతున్న పేద ప్రజలకు అండగా నిలుస్తానని.. అందుకే యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ సంస్థలో (Universal Human Rights organization) చేరానని భిక్కనూరుకు (Bhikanoor) చెందిన పెద్ద బచ్చగారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
భిక్కనూరు గ్రామానికి చెందిన తాను అమెరికాలో స్థిరపడి ఇక్కడికి సమాజ సేవ కోసం వచ్చినట్లు తెలిపారు. గ్రామంలో పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో (social service programs) పాల్గొన్నానని వివరించారు. ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నానని తెలిపారు. జిల్లాలో అనేక మంది న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకుంటున్నారని, ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతున్నారన్నారు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరినట్లు చెప్పారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి కల్పించిన రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన శక్తి మేరకు అన్యాయం జరుగుతున్న ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, నాయకులు రవి, సుధాకర్ పాల్గొన్నారు.